HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Ias Officer Condemns Ministers Comments On Samanthas Divorce

Smita Sabharwal : మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్మితా సబర్వాల్ రియాక్షన్

కొండా సురేఖ కామెంట్స్‌ను ఓ వైపు టాలీవుడ్ ఖండిస్తుండగా మరోవైపు స్మితా సబర్వాల్ (Smita Sabharwal) కూడా రియాక్ట్ అయ్యారు.

  • Author : Pasha Date : 03-10-2024 - 12:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Smita Sabharwal Tweet

Smita Sabharwal : సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. సమంత, నాగచైతన్య విడాకుల విషయంలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. కొండా సురేఖ కామెంట్స్‌ను ఓ వైపు టాలీవుడ్ ఖండిస్తుండగా మరోవైపు స్మితా సబర్వాల్ (Smita Sabharwal) కూడా రియాక్ట్ అయ్యారు. ‘‘కేవలం ప్రజల దృష్టిని ఆకట్టుకునేందుకు ఇలాంటి కామెంట్స్ చేయడం సరికాదు. సంచలనాత్మకంగా మారేందుకు మహిళలను టార్గెట్‌గా ఎంచుకోవడం బాధ కలిగించే అంశం’’ అని స్మితా అభిప్రాయపడ్డారు. ‘‘చివరకు అధికారులను కూడా వదిలిపెట్టడం లేదు. వ్యక్తిగత అనుభవంతో నేను ఈ వ్యాఖ్యలు చేస్తున్నాను’’ అని ఆమె పేర్కొన్నారు. ‘‘మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు నాకు షాక్ కలిగించాయి. సాటి మహిళగా నాకు ఆ మాటలు గౌరవప్రదంగా  అనిపించలేదు. ప్రతీ అంశాన్ని రాజకీయం చేయాలని భావించడం మంచిది కాదు’’ అని స్మితా సూచించారు. ‘‘ప్రజా జీవితంలో ఉండే వాళ్లు సరిగ్గా, గౌరవప్రదంగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది’’ అని ఆమె పేర్కొన్నారు. మహిళలు, కుటుంబాలు, సామాజిక కట్టుబాట్లు గౌరవించేలా అందరి వ్యాఖ్యలు ఉండాలన్నారు. ఈమేరకు ఎక్స్ వేదికగా స్మితా సబర్వాల్ ఒక పోస్ట్ చేశారు.

Also Read :Azharuddin : అజారుద్దీన్‌కు ఈడీ సమన్లు.. హెచ్‌సీఏ నిధుల మనీలాండరింగ్ కేసులో కీలక పరిణామం

సమంత, నాగచైతన్య విడాకుల విషయంలో తాను చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతుండటంతో మంత్రి కొండా సురేఖ వెనక్కి తగ్గారు. ఆ విషయంలో తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు మంత్రి ప్రకటించారు. తన వ్యాఖ్యలు సమంత మనోభావాలను దెబ్బతీసేలా లేవని ఆమె స్పష్టం చేశారు. సమంత స్వశక్తితో జీవితంలో ఎదిగారని, తాను కేవలం ఆమెను మెచ్చుకున్నానని సురేఖ చెప్పుకొచ్చారు. తాను కూడా సమంతను స్ఫూర్తిగా భావిస్తున్నానని మంత్రి చెప్పారు. తన వ్యాఖ్యల వల్ల సమంత కానీ, ఆమె అభిమానులు కానీ బాధపడి ఉంటే.. ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకునేందుకు తాను రెడీ అని కొండా సురేఖ చెప్పారు.

Also Read :Konda Surekha : సమంత విడాకుల వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న తెలంగాణ మంత్రి


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Minister Konda Surekha
  • Samantha
  • Samanthas Divorce
  • smita sabharwal
  • telangana
  • Telangana IAS officer
  • telangana minister

Related News

MIssing Case

Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

ఫిన్లాండ్‌లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థి 45 రోజులుగా అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. కుమారుడి ఆచూకీ కోసం తీవ్ర ఆందోళనకు గురైన తల్లిదండ్రులు చివరకు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హయత్‌నగర్‌కు చెందిన గుజ్జ మణిదీప్ రెడ్డి, ఫిన్లాండ్‌లోని లాహ్తిలో ఉన్న LUT యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్నాడు. మే 5న తన కుటుంబ సభ్యులతో చివరిసారిగా మాట్లాడిన తర

  • As for Samantha, the gem of our family, she is doing...

    Maa Inti Bangaram: సమంత మా ఇంటి బంగారం ఎలా ఉందంటే..

  • Engineering counselling in Telangana begins today.

    TS EAPCET 2026: తెలంగాణలో నేటి నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్

  • Alert for gas consumers: June 30 is the final deadline. These requirements must be met—otherwise, the connection will be disconnected.

    LPG Gas Subsidy: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. జూన్ 30 వరకే డెడ్ లైన్.. ఇవి తప్పక పాటించాల్సిందే.. లేదంటే కనెక్షన్ కట్

  • Pawan Kalyan's tour in Telangana... Janasena chief to fulfill a young child's last wish.

    Pawan Kalyan: తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని

Latest News

  • ఈ గొప్పల దండకం ఇక చాలు.. కేటీఆర్, బీఆర్ఎస్‌లు ఈ వాస్తవాలు తనిఖీ చేసుకోవాలి !

  • Bandi Bhagirath: బండి భగీరథ్‌కు కండీషనల్ బెయిల్…

  • Mudragada Padmanabham Reddy: ముద్రగడ పద్మనాభ రెడ్డి కి తీవ్ర అస్వస్థత..!

  • Brazil Nuts: రోజూ ఈ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు!

  • Monalisa: కుంభమేళా మోనాలిసాకు భద్రత కల్పించండి హైకోర్టు కీలక ఆదేశాలు

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd