Drug Case: హీరో నవదీప్ కు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు
నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు గత వారం రోజులుగా నటుడు నవదీప్ కోసం గాలిస్తున్నారు.
- By Balu J Published Date - 03:28 PM, Wed - 20 September 23

Drug Case: మాదాపూర్ డ్రగ్ కేసు అనేక మలుపులు తిరుగుతూనే ఉంది. తాజాగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు గత వారం రోజులుగా నటుడు నవదీప్ కోసం గాలిస్తున్నారు. నటుడు పరారీలో ఉన్నాడని పోలీసులు ప్రకటించారు. అయితే నవదీప్ తెలంగాణ హైకోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. సెక్షన్ 41ఏ కింద నవదీప్‌కు నోటీసులు జారీ చేయాలని పోలీసులను హైకోర్టు కోరింది.
విచారణ నిమిత్తం పోలీసుల ఎదుట హాజరు కావాలని హైకోర్టు నవదీప్‌ను ఆదేశించింది. నవదీప్ ప్రమేయం, డ్రగ్స్ కొనుగోలుపై పక్కా ఆధారాలు ఉన్నాయని ఎన్‌సీబీ అధికారులు వెల్లడించారు. డ్రగ్స్ కేసులో విచారణకు నవదీప్ హాజరుకాకపోతే అరెస్ట్ చేస్తామని కూడా చెప్పారు. హైదరాబాద్‌లో రెండు రేవ్ పార్టీలను ఛేదించారు పోలీసులు. ఈ కేసులో ప్రమేయం ఉన్న వారందరినీ ఎన్‌సిబి అధికారులు అరెస్టు చేస్తున్నారు.
అయితే డ్రగ్ కేసులో నవదీప్‌ను డ్రగ్స్ వాడే వ్యక్తిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసుల దాడుల్లో పట్టుబడిన రామ్ చంద్ అనే వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలంలో.. నవదీప్ తనతో కలిసి డ్రగ్స్ తీసుకున్నాడని రామ్ చంద్ పేర్కొన్నాడు. దీంతో టీఎస్ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు నవదీప్‌ను ఈ కేసులో నిందితుడిగా చేర్చారు. ఈ క్రమంలో పోలీసులు హైదరాబాద్‌లోని నవదీప్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో నవదీప్ ఇంట్లో లేకపోవడం గమనార్హం.
Also Read: Mega Job Mela: పాలకుర్తితో మెగా జాబ్ మేళా, 14, 205 మందికి ఉద్యోగావకాశాలు