High Court Jobs : తెలంగాణ హైకోర్టులో లా క్లర్క్ జాబ్స్.. మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక
అభ్యర్థులు నవంబరు 23వ తేదీన సాయంత్రం 5 గంటల్లోగా ఆఫ్‌లైన్‌లో అప్లై(High Court Jobs) చేయాలి.
- By Pasha Published Date - 04:24 PM, Wed - 30 October 24

High Court Jobs : తెలంగాణ హైకోర్టులో జాబ్స్ పొందే అవకాశం ఇది. 33 లా క్లర్క్ పోస్టుల భర్తీకి తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వీటిలో 31 పోస్టులు తెలంగాణ హైకోర్టులో, 2 పోస్టులు సికింద్రాబాద్‌లోని తెలంగాణ స్టేట్ జ్యుడీషియల్ అకాడమీలో ఉన్నాయి. అయితే ఈ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారనే విషయాన్ని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. అభ్యర్థులు నవంబరు 23వ తేదీన సాయంత్రం 5 గంటల్లోగా ఆఫ్‌లైన్‌లో అప్లై(High Court Jobs) చేయాలి. దరఖాస్తులను ‘‘ది రిజిస్ట్రార్ జనరల్, తెలంగాణ హైకోర్టు, హైదరాబాద్’’ చిరునామాకు పంపించాలి.
Also Read :Triumph Tiger 1200 : దీపావళి వేళ ‘ట్రయంఫ్’ కొత్త బైక్.. ‘2025 టైగర్ 1200’ ఫీచర్లు ఇవీ
లా క్లర్క్ పోస్టుకు అప్లై చేస్తున్నారా.. ఇవి తెలుసుకోండి
- లా డిగ్రీ ఉన్నవారు అప్లై చేయడానికి అర్హులు. కంప్యూటర్ నాలెడ్జ్, పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు.
- 18 నుంచి 30 ఏళ్లలోపు వారు అప్లై చేయొచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఇస్తారు.
- ఎటువంటి రాత పరీక్ష లేదు. అప్లికేషన్‌కు ఎలాంటి ఫీజు కూడా లేదు.
- అర్హతలు, మెరిట్ మార్కుల ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
- తెలంగాణలోని అన్ని జిల్లాల వారు అప్లై చేయొచ్చు.
- అభ్యర్థులు తమ కుల ధ్రువీకరణ పత్రంతో పాటు 1వతరగతి నుంచి 7వ తరగతి వరకు చదివిన స్టడీ సర్టిఫికెట్స్‌ను సమర్పించాలి.
- ఈ పోస్టులకు ఎంపికయ్యే అభ్యర్థులకు ప్రతినెలా రూ.27,000 చొప్పున శాలరీ చెల్లిస్తారు. ఇతర అలవెన్సులు, ప్రయోజనాలు ఉండవు.
Also Read :Russia Vs Google : గూగుల్‌పై కట్టలేనంత భారీ జరిమానా.. రష్యా సంచలన నిర్ణయం
ఏపీ మహిళా, శిశు సంక్షేమ శాఖలో 12 పోస్టులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్‌టీఆర్ జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ సాధికారిత అధికారి కార్యాలయం 12 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా వివిధ ఉద్యోగాలను కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. వీటికి కూడా రాత పరీక్ష లేదు. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. భర్తీ చేయనున్న 12 ఉద్యోగాల్లో.. 4 ఆయా పోస్టులు, 2 ఆర్ట్ & క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్ (పార్ట్ టైం) పోస్టులు, 2 పీటీ ఇన్‌స్ట్రక్టర్ కం యోగా టీచర్ (పార్ట్ టైం) పోస్టులు ఉన్నాయి. 2 హెల్పర్, 2
హౌస్ కీపర్ పోస్టులు ఉన్నాయి. అకౌంటెంట్, డేటా అనలిస్ట్, మేనేజర్ / కో ఆర్డినేటర్, ఏఎన్ఎం (నర్స్), డాక్టర్ (పార్ట్ టైం), చౌకిదార్, స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్, ఎడ్యు కేటర్ (పార్ట్ టైం), కుక్, హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్ చెరొక పోస్టును భర్తీ చేయనున్నారు. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ నవంబరు 5.