High Court : జన్వాడ ఫామ్ హౌజ్ కూల్చివేతపై హైడ్రాకు కోర్టు కీలక ఆదేశాలు
ఫామ్‌హౌజ్ కూల్చివేతలో నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని హైడ్రాను కోర్టు ఆదేశించింది.
- Author : Latha Suma
Date : 21-08-2024 - 4:14 IST
Published By : Hashtagu Telugu Desk
Telangana High Court: జన్వాడ ఫామ్‌హౌస్(janwada farmhouse) కూల్చివేతను రేపటి వరకు చేపట్టవద్దని తెలంగాణ హైకోర్టు హైదరాబాద్ డిజాస్టర్‌మేనేజ్‌మెంట్ అసెట్ ప్రొటెక్షన్ (హైడ్రా) (Hydra)కు కీలక ఆదేశాలు జారీ చేసింది. జన్వాడ ఫామ్‌హౌజ్ కూల్చివేయకుండా హైడ్రాను ఆదేశించాలంటూ వేసిన పిటిషన్‌ను బుధవారం(ఆగస్టు21) హైకోర్టు విచారించింది. ఫామ్‌హౌజ్ కూల్చివేతలో నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని హైడ్రాను కోర్టు ఆదేశించింది. జీవో 99 ప్రకారమే కూల్చివేతలు చేపట్టాలని కోరింది. ఫామ్‌హౌజ్ కూల్చివేయకుండా స్టే ఇవ్వాలన్న పిటిషన్ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది.
We’re now on WhatsApp. Click to Join.
కూల్చివేతకు ముందు ఫామ్‌హౌజ్‌కు సంబంధించిన అనుమతి పత్రాలను పూర్తిగా పరిశీలించాలని హైడ్రా కమిషనర్‌కు హైకోర్టు సూచించింది. హైడ్రా అధికారాలు ఏంటని పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు ప్రభుత్వాన్ని అడిగి తెలుసుకుంది. హైడ్రా జీహెచ్‌ఎంసీతో కలిసి పనిచేస్తుందని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. అవుటర్ రింగురోడ్డు (ఓఆర్‌ఆర్) పరిధిలో చెరువులు, కుంటలను కాపాడటమే హైడ్రా విధి అని అడిషనల్ అడ్వకేట్ జనరల్ హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. హైడ్రా న్యాయవాది విచారణకు రాకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
కాగా, గ్రామపంచాయతీ సర్పంచ్ నిర్మాణానికి అనుమతి ఇచ్చాడని జన్వాడ ఫామ్‌హౌజ్ తరపున పిటిషన్ వేసిన వ్యక్తి తరపు న్యాయవాది కోర్టు తెలిపారు. నిర్మాణానికి అనుమతి ఇవ్వడానికి సర్పంచ్‌కు ఎలాంటి అధికారం ఉందని హైకోర్టు ప్రశ్నించింది. గ్రామపంచాయతీ సెక్రటరీకి మాత్రమే అనుమతులు ఇచ్చే అధికారం ఉందని, సర్పంచ్‌కు లేదని పేర్కొంది.
కాగా, ఆగస్టు 14న కొంతమంది అధికారులు వచ్చి జన్వాడ ఫామ్ హౌస్‌ను కూల్చివేస్తామని బెదిరించారని పిటిషనర్ తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు… జన్వాడ ఫామ్ హౌస్‌కు సంబంధించి అన్ని డాక్యుమెంట్లను పరిశీలించాలని ఆదేశించింది. జీవో 99 ప్రకారం నిబంధనల మేరకు హైడ్రా నడుచుకోవాలని పేర్కొంది.