Note-For-Vote Case : ఓటుకు నోటు కేసులో చంద్రబాబు కు భారీ ఊరట
రాజకీయంగా బలం ఉంటే మళ్లీ పోటీ చేసి గెలవాలని ఆళ్ల రామకృష్ణారెడ్డికి హితవు పలికింది. ఈ సందర్భంగా పిటిషనర్‌కు ఉన్న అర్హత, రాజకీయ నేపథ్యంపై ధర్మాసనం ఆరా తీసింది
- Author : Sudheer
Date : 21-08-2024 - 3:58 IST
Published By : Hashtagu Telugu Desk
ఓటుకు నోటు కేసు (Note-For-Vote case)లో ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) కు భారీ ఊరట లభించింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుని నిందితుడిగా చేర్చాలని, కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని వైసీపీ నేత ఆళ్లరామకృష్ణారెడ్డి (Alla Ramakrishnareddy)వేసిన రెండు పిటిషన్లను ధర్మాసనం కొట్టేసింది. రాజకీయ కక్ష సాధింపులకు న్యాయస్థానాన్ని వేదికగా చేర్చుకోవద్దంటూ పిటిషనర్ రామకృష్ణారెడ్డిని జస్టిస్ సుందరేశ్ ధర్మాసనం మందలించింది.
We’re now on WhatsApp. Click to Join.
రాజకీయంగా బలం ఉంటే మళ్లీ పోటీ చేసి గెలవాలని ఆళ్ల రామకృష్ణారెడ్డికి హితవు పలికింది. ఈ సందర్భంగా పిటిషనర్‌కు ఉన్న అర్హత, రాజకీయ నేపథ్యంపై ధర్మాసనం ఆరా తీసింది. పిటిషనర్‌కు హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో పదేళ్ల క్రితం జరిగిన ఓటుకు నోటు కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబును కూడా నిందితుడిగా చేర్చాలని కోరుతూ మంగళగిరి వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డి గతంలో సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఈ కేసు విచారణను సీబీఐకు అప్పగించాలని, తద్వారా కేసులో పారదర్శకత పెరుగుతుందని మరో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ఇప్పటికే సుప్రీంకోర్టు ఎన్నోసార్లు విచారణ జరిపి వాయిదా వేస్తూ వచ్చింది. తాజాగా వాటిని కొట్టేస్తూ తీర్పు ఇచ్చింది.
Read Also : KTR Assets : నాకంటూ ఎలాంటి ఫామ్ హౌజ్ లేదు – కేటీఆర్