HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana High Court Acquits Ias Y Srilakshmi From Obulapuram Mining Case

IAS Srilakshmi: ఓబులాపురం కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి క్లీన్ చీట్!

ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి బిగ్ రిలీఫ్ లాంటి వార్త. ఓబులాపురం మైనింగ్ కంపెనీ కేసులో నిర్దోషిగా పరిగణిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. సుదీర్ఘ

  • Author : HashtagU Desk Date : 08-11-2022 - 4:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Srilaxmi
Srilaxmi

ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి బిగ్ రిలీఫ్ లాంటి వార్త. ఓబులాపురం మైనింగ్ కంపెనీ కేసులో నిర్దోషిగా పరిగణిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. సుదీర్ఘ కాలంగా కొన‌సాగుతున్న ఈ కేసును మంగ‌ళ‌వారం నాడు హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు శ్రీలక్ష్మికి క్లీన్‌చిట్ ఇచ్చింది.  దీంతో ఆమె ఏపీ చీఫ్ సెక్రటరీ గా నియమితులు అయ్యేందుకు అడ్డంకులు సైతం తొల‌గిపోయాయి. శ్రీలక్ష్మి 1988 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. ఆమె ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ ప్ర‌త్యేక‌ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన ఓబులాపురం మైనింగ్ కేసులో ఆరో నిందితురాలిగా ఉన్న ఆమె 2011లో అరెస్ట్ అయ్యింది. దీంతో ప్రభుత్వం ఆమెను సస్పెండ్‌ చేసింది. చంచల్‌గూడ మహిళా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆమె 2013 ఏప్రిల్ 2న షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ద్వారా విడుదలైంది. ఆమె జైలు నుంచి బెయిల్‌పై విడుదలయిన తర్వాత ప్రభుత్వం సస్పెన్షన్‌ను ఎత్తి వేసింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో ఆమె పోస్టల్ అడ్రస్‌ తెలంగాణలో ఉండడంతో కేంద్ర ప్ర‌భుత్వం శ్రీ‌ల‌క్ష్మిని తెలంగాణకు కేటాయించింది. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ఆమెను ప్రభుత్వరంగ సంస్థల శాఖ ముఖ్యకార్యదర్శిగా నియమించింది. 2014లో ఏపీలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ‌చ్చాక శ్రీ‌ల‌క్ష్మి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వెళ్లేందుకు ప్రయత్నించింది. కేంద్ర ప్రభుత్వం ఆమెను ఆంధ్రప్రదేశ్ కు పంపేందుకు నిరాకరించింది. ఆ నిర్ణయంపై శ్రీలక్ష్మి కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ ను ఆశ్రయించింది. ఆమె తన సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, దానికి సంబందించిన ఆధారాలను అందజేసింది. క్యాట్ ను ఆశ్రయించిన ఆమె విజయం సాధించింది. క్యాట్ అదేశాలతో కేంద్రప్రభుత్వం ఆమెను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేసింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Highcourt
  • hyderabad
  • IAS Srilakshmi
  • telangana

Related News

International Thalassemia Day

Nara Bhuvaneswari: ‘తలసేమియా రన్’ వ్యాధిపై అవగాహన కల్పించి చిన్నారులు అండగా నిలవాలని నారా భువనేశ్వరి

తలసేమియా వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆదివారం హైదరాబాద్‌లో భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నగరంలోని నెక్లెస్ రోడ్డులో ‘తలసేమియా రన్’ను ఘనంగా నిర్వహించింది. జలవిహార్ వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు. ఈ పరుగులో 3K, 5K, 10K విభా

  • Retired IPS Officer Wife Incident in Jubilee Hills

    Hyderabad: జూబ్లీహిల్స్ లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య

  • New Policy on Fee Reimbursement in Telangana

    Telangana Fee Reimbursement: తెలంగాణ ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో కొత్త పాలసీ!

Latest News

  • Stock Market: మరోసారి నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

  • TG Inter: నేటి నుంచే తెలంగాణ ఇంటర్ షెడ్యూల్‌ విడుదల

  • AP Government: అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలను పరిశీలించిన మంత్రి నారాయణ

  • Ram Charan: పెద్ది సినిమా ట్రైలర్ అప్‌డేట్ వచ్చేసింది

  • CM Vijay: విజయ్ వ్యక్తిగత జ్యోతిషుడికి ఓఎస్డీ పదవి

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd