CCTV Cameras: పోలీస్ స్టేషన్ లలో సీసీ కెమెరాల ఏర్పాటుపై రేపు హైకోర్టులో విచారణ
పోలీస్ స్టేషన్ లలో సీసీ కెమెరాల ఏర్పాటుపై గత కొంతకాలంగా వాదనలు జరుగుతున్నాయి. పోలీసులు చట్టాన్ని చేతిలోకి తీసుకుని, మానవ హక్కులను ఉల్లంగిస్తూ
- By Praveen Aluthuru Published Date - 04:31 PM, Sun - 9 July 23

CCTV Cameras: పోలీస్ స్టేషన్ లలో సీసీ కెమెరాల ఏర్పాటుపై గత కొంతకాలంగా వాదనలు జరుగుతున్నాయి. పోలీసులు చట్టాన్ని చేతిలోకి తీసుకుని, మానవ హక్కులను ఉల్లంగిస్తూ అమాయక ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే అన్ని పోలీస్ స్టేషన్ లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా పోలీసులు క్రూరత్వానికి అడ్డుకట్ట వేయవచ్చని చెప్పారు న్యాయవాది రాపోలు భాస్కర్. తెలంగాణలోని అన్ని పోలీస్ స్టేషన్ లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనీ భాస్కర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
పోలీసు స్టేషన్‌లలో సీసీటీవీ నిఘా ఉంటే కస్టడీలో చిత్రహింసలు, మరణాల ఘటనలు తగ్గుముఖం పడతాయని పిల్‌లో పేర్కొన్నారు.. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాల ఏర్పాటుపై దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు సోమవారం (జూలై 10) విచారణ చేపట్టనుంది.
తెలంగాణలో అనేక కస్టడీ మరణాలు చోటుచేసుకున్నాయి.
1. జూన్ 2021లో ఖమ్మం జిల్లాలో 45 ఏళ్ల దళిత మహిళ మరియమ్మ పోలీసు కస్టడీలో మరణించింది. ఈ ఘటనతో ముగ్గురు పోలీసులను విధుల నుంచి తొలగించారు.
2. మార్చి 2022లో సూర్యాపేట పోలీసులు వీర శేఖర్‌ని కస్టడీలో హింసించడంతో అతని నాడీ వ్యవస్థ దెబ్బతింది.
3. మహ్మద్ ఖదీర్ (35) అనే కార్మికుడిపై 2023 ఫిబ్రవరిలో మెదక్ పోలీసులు రాక్షసత్వాన్ని ప్రదర్శించారు. దాంతో ఆ వ్యక్తి కస్టడీలో మరణించాడు. ఈ కేసులో నలుగురు పోలీసులను సస్పెండ్ కు గురయ్యారు.
4. ఏప్రిల్ 2023లో ఆటోరిక్షా డ్రైవర్ తుకారాంగేట్ పోలీస్ స్టేషన్‌లో మరణించాడు. విచారణ సమయంలో అతనిని పోలీసులు చిత్రహింసలకు గురి చేశారని బయటపడింది.
2023 మార్చిలో అన్ని పోలీసు స్టేషన్‌లలో సీసీ కెమెరాల స్థితిగతులు, ఫుటేజీల నిర్వహణపై నివేదిక సమర్పించాలని డీజీపీ అంజనీకుమార్‌ను హైకోర్టు ఆదేశించింది.
Read More: Andhra Pradesh: ఒబెరాయ్ హోటల్స్‌కు సీఎం జగన్ శంకుస్థాపన