Telangana Rains : రెయిన్ ఎఫెక్ట్… మూడు రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జులై 11 నుంచి 13 వరకు అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.
- Author : Prasad
Date : 10-07-2022 - 3:47 IST
Published By : Hashtagu Telugu Desk
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జులై 11 నుంచి 13 వరకు అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వర్షాభావ ప్రాంతాలు, ప్రస్తుత స్థితిగతులు, వర్షాల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను సమీక్షించేందుకు ఆయన ఆదివారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో మంత్రులు, ఉన్నతాధికారులతో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో విద్యాసంస్థలకు సెలవు ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. వరదల నేపథ్యంలో విద్యార్థులు పాఠశాలలకు వచ్చేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా సెలవులను ప్రకటించారు.