Telangana Governor : వరద ప్రభావిత ప్రాంతాల్లో తెలంగాణ గవర్నర్.. బాధితులకు అండగా
తెలంగాణలో భారీవర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. వారం రోజులుగా వరద ముంపులోనే చాలా గ్రామాలు చిక్కుకున్నాయి.
- Author : Prasad
Date : 17-07-2022 - 7:54 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణలో భారీవర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. వారం రోజులుగా వరద ముంపులోనే చాలా గ్రామాలు చిక్కుకున్నాయి. అయితే వరద బాధితులకు అండగా నిలిచేందుకు తెలంగాణ గవర్నర్ తమిళిసై భధ్రాచలంలోని వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.
సికింద్రాబాద్ నుంచి రైలు మార్గం ద్వారా ఆమె మణుగూరుకు చేరుకున్నారు. మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్‌లో టిఫిన్ చేసిన అనంతరం వరద ముంపు గ్రామాల్లో ఆమె పర్యటించనున్నారు. వరద బాధితులను స్వయంగా పరామర్శించనున్నారు. అశ్వాపురం మండలంలోని పాములపల్లి గ్రామంలోని వరద బాధితులను గవర్నర్ తమిళిసై కలువనున్నారు. చింతిర్యాల కాలనీలో పర్యటిస్తారు. అనంతరం రెండు ఫంక్షన్ హాల్స్‌లో రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా వరద బాధితులకు నిత్యావసర సరుకులు, మందులను పంపిణీ చేయనున్నారు.
Reached Aswapuram of #badrachalam district on the way to Heavy water plant ….#Telenganarains pic.twitter.com/ZptfTDyZiR
— Dr Tamilisai Soundararajan (@DrTamilisai4BJP) July 17, 2022