Govt Action Plan : ‘కోడ్’ ముగియగానే రేవంత్ సర్కారు సంచలన నిర్ణయాలు
ఎన్నికల కోడ్ సమయం ముగియగానే జన రంజక పాలన ద్వారా ప్రజలతో మమేకం కావాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ సర్కారు ఉంది.
- By Pasha Published Date - 10:56 AM, Wed - 29 May 24

Govt Action Plan : ఎన్నికల కోడ్ సమయం ముగియగానే జన రంజక పాలన ద్వారా ప్రజలతో మమేకం కావాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ సర్కారు ఉంది. కోడ్ ముగియగానే కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు సమాయత్తం అవుతోంది. ఇంతకీ అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join
జాబ్ క్యాలెండర్
సీఎం రేవంత్ సర్కారు ఎన్నికల కోడ్(Govt Action Plan) ముగిశాక సాధ్యమైనంత త్వరగా జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. దీని తయారీ ప్రక్రియ ఇప్పటికే కొలిక్కి వచ్చిందని అంటున్నారు. ఈవార్త ఎంతోమంది నిరుద్యోగ యువతకు ఊరటను ఇవ్వనుంది.కేంద్రంలోని యూపీఎస్సీ తరహాలో తెలంగాణలోని టీఎస్‌పీఎస్సీ కూడా జాబ్ క్యాలెండర్ మోడల్‌ను అమలు చేయనుందని అంటున్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన తర్వాత ఏ నెలలో ఏ జాబ్ నోటిఫికేషన్ వస్తుందనే దానిపై ముందే క్లారిటీ వచ్చేస్తుంది.
రేషన్ కార్డులు
ఎన్నికల కోడ్ ముగిశాక కొత్త రేషన్ కార్డుల జారీపై రేవంత్ సర్కారు ఫోకస్ పెట్టనుంది. అర్హులైన అందరికీ కొత్త రేషన్ కార్డు ఇవ్వాలనే పట్టుదలతో తెలంగాణ ప్రభుత్వం ఉంది. కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వడంలో భాగంగా ప్రతీ ఇంటికి ప్రభుత్వ సిబ్బంది వెళ్లి, క్షేత్ర స్థాయి పరిశీలన చేయనున్నారు.
మూసీ నది సుందరీకరణ
ఎన్నికల కోడ్ ముగియగానే మూసీ నది సుందరీకరణ పనులపై తెలంగాణ సర్కారు ఫోకస్ చేయనుంది. మూసీ నది సుందరీకరణ కోసం ఇప్పటివరకు 7 టెండర్లు అర్హత పొందినట్లు సమాచారం. వీటిలో త్వరలోనే ఎల్ 1, ఎల్ 2ను ఎంపిక చేసి సుందరీకరణ పనులను మొదలుపెట్టే ఛాన్స్ ఉంది. మూసీ నదిపై అక్రమంగా నిర్మించిన 12 వేల అక్రమ కట్టడాలను విడతల వారీగా తొలగించనున్నట్లు తెలుస్తోంది. మూసీకి ఆనుకొని కమర్షియల్ కాంప్లెక్స్ లు, వాటర్ ఫాల్స్, లైటింగ్స్, గ్రీనరీ, స్పోర్ట్స్ గేమింగ్ మాల్స్ ఏర్పాటు చేయనున్నారు.
- తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖలో బదిలీలు జరిగే ఛాన్స్ ఉంది.
- ఏపీకి వెళ్లిన హెచ్‌వోడీ పోస్టులను క్రియేట్ చేస్తూ, సీనియారిటీ ప్రకారం వాటిలో నియామకాలు చేసేందుకు కసరత్తు జరగనుంది.
- పబ్లిక్ హెల్త్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ వంటి విభాగాల్లో మార్పులు జరిగే ఛాన్స్ ఉంది.
- టీఎస్ఎంఎస్ఐడీసీలోనూ కొత్త అధికారులు, స్టాఫ్‌ను నియమించాలని సర్కారు యోచిస్తోంది.