Gaddar Awards : గద్దర్ అవార్డ్స్..విధివిధానాలు ఖరారు
. ఇవే కాకుండా తొలి ఫీచర్ ఫిల్మ్, యానిమేషన్ ఫిల్మ్, డాక్యుమెంటరీ, షార్ట్ ఫిల్మ్ వంటి విభాగాల్లోనూ ఈ అవార్డులను ప్రదానం చేయాలని భావిస్తోంది.
- By Latha Suma Published Date - 06:07 PM, Tue - 11 March 25

Gaddar Awards : తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డుల విధివిధానాలు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అనుకోని కారణాల వలన ఈ వేడుక ఉగాది నుంచి ఏప్రిల్ మొదటివారంలో నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ తాజాగా క్లారిటీ ఇచ్చింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సంవత్సరం (2014) నుంచి 2013 వరకు ఒక్కో సినిమాకు ఉత్తమ చలన చిత్రం అవార్డును ఇవ్వబోతున్నట్లు తాజాగా ప్రకటించింది. ఈ అవార్డుల విధివిధానాలను ఇటీవల ఖరారు చేసిన ప్రభుత్వం, మార్చి 13 నుంచి దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది.
Read Also: Quantum Valley : ఏపీలో క్వాంటమ్ వ్యాలీ..చంద్రబాబు ఐడియాకి టాటా సీఈవో ఫిదా…!!
తెలుగు సినిమాపై పుస్తకాలు, విశ్లేషణలు రాసిన వారికి, నటీనటులు, సాంకేతిక నిపుణులకు కూడా ఈ గౌరవాన్ని అందించనున్నారు. అలాగే తెలంగాణ సినిమా రంగంలో అసాధారణ సేవలు అందించిన పైడి జయరాజ్, కాంతారావు పేర్లతో కూడా ప్రత్యేక పురస్కారాలను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఈ వేడుకలలో సినిమా నటులతో పాటు దర్శకులు, సాంకేతిక నిపుణులతో పాటు ఐక్యతను పెంపొందించే సాంసృతిక విద్యా, సామాజిక ఔచిత్యం, జాతీయ సమైక్యతను ప్రోత్సహించే చిత్రాలు, బాలల సినిమాలు, పర్యావరణం, హెరిటేజ్, చరిత్ర ఆధారిత చిత్రాల విభాగాల్లో ప్రభుత్వం పురస్కారాలు ఇవ్వనుంది. ఇవే కాకుండా తొలి ఫీచర్ ఫిల్మ్, యానిమేషన్ ఫిల్మ్, డాక్యుమెంటరీ, షార్ట్ ఫిల్మ్ వంటి విభాగాల్లోనూ ఈ అవార్డులను ప్రదానం చేయాలని భావిస్తోంది.