TG Another DSC : మరో డీఎస్సీ కి తెలంగాణ సర్కార్ సిద్ధం – భట్టి
ఇప్పటికే 11,062 పోస్టులకు నియామక ప్రక్రియ కొనసాగుతుండగా, మరో డీఎస్సీ ఇస్తామని ప్రకటించారు. 5-6 వేల పోస్టులతో త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు
- By Sudheer Published Date - 05:20 PM, Sun - 14 July 24

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Telangana Deputy CM Mallu Bhatti Vikramarka) నిరుద్యోగులకు (Unemployed) తీపి కబురు అందించారు. 5-6 వేల పోస్టులతో త్వరలోనే మరో డీఎస్సీ (Another DSC) నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ సర్కార్ 11,062 పోస్టులతో కూడిన డీఎస్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలు ఈ నెల 18 నుండి మొదలుకాబోతున్నాయి. ఈ 11 , 062 పోస్టులకు గాను దాదాపు 3 లక్షల మంది పరీక్షలు రాయబోతున్నారు. అయితే ఈ డీఎస్సీ పై గత కొద్దీ రోజులుగా నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని, 11,062 పోస్టులను మరింత పెంచాలని..పెంచిన తర్వాత మళ్లీ కొత్త డీఎస్సీ తేదీన విడుదల చేయాలనీ కోరుతూ ఆందోళన చేస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం నిరుద్యోగుల డిమాండ్స్ ను , ఆందోళనలు పట్టించుకోకుండా పరీక్షలు నిర్వహిస్తుంది. అయినప్పటికీ నిరుద్యోగులు మాత్రం తమ ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో డీఎస్సీ నిర్వహణపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే 11,062 పోస్టులకు నియామక ప్రక్రియ కొనసాగుతుండగా, మరో డీఎస్సీ ఇస్తామని ప్రకటించారు. 5-6 వేల పోస్టులతో త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు. ప్రస్తుతం భట్టి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మరి భట్టి చెప్పినట్లు మరో DSC నోటిఫికేషన్ వేస్తారా..? లేక ప్రస్తుతం ఆందోళనలు కొనసాగుతున్న క్రమంలో నిరుద్యోగులను కంట్రోల్ చేయడానికి ఆలా చెప్పారా..? అనేది చూడాలి.
Read Also : KTR : అధికారంలోకి వచ్చాక ఎన్ని నోటీఫికేషన్లు ఇచ్చారు? ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు?: కేటీఆర్