Aarogyasri : ఆరోగ్యశ్రీ చికిత్సల ధరలను సవరించిన తెలంగాణ ప్రభుత్వం
ఆరోగ్యశ్రీ చికిత్సకు సంబంధించిన ధరలను తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) సవరించింది. 1,375 ప్యాకేజీల ధరలు సవరిస్తూ జీవో 30ని జారీ చేసింది.
- Author : Latha Suma
Date : 22-07-2024 - 9:00 IST
Published By : Hashtagu Telugu Desk
Aarogyasri: ఆరోగ్యశ్రీ చికిత్సకు సంబంధించిన ధరలను తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) సవరించింది. 1,375 ప్యాకేజీల ధరలు సవరిస్తూ జీవో 30ని జారీ చేసింది. మిగిలిన 297 ప్యాకేజీ ధరల్లో మార్పు లేదని జీవోలో ప్రభుత్వం వెల్లడించింది. కాగా, కొత్తగా 163 చికిత్సలను చేరుస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) అధికారంలోకి వచ్చాక సంగటున 20 నుండి 20 శాతం రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని వైద్యా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనిర్సంహ ఈ సందర్భంగా తెలిపారు. ఆరోగ్యశ్రీలో కొత్తగా తీసుకున్న నిర్ణయాలతో ప్రభుత్వంపై రూ.438 కోట్ల భారం పడుతుందన్నారు. ఆరోగ్యశ్రీకి సంబంధించి అదనపు ఖర్చు రూ.600 కోట్లు పెరిగిందన్నారు. ట్రస్ట్ ద్వారా దాదాపు 6 లక్షల మందికి బాసటగా ఉందన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
కొత్త ప్రొసీజర్స్‌తో మరో లక్షన్నర కుటుంబాలను ఆదుకోబోతుందన్నారు. 79లక్షల కుటుంబాలకు ఆరోగ్యపరంగా ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ఇదిలా ఉండగా.. ఆరోగ్యశ్రీ (Aarogyasri)పేదలకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందించే పథకాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఆరోగ్యశ్రీ అనేది పేదలకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వ తీసుకువచ్చిన పథకం. ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తూ అందరికీ ఆరోగ్యం సాధించడమే ప్రభుత్వ లక్ష్యం.