Telangana – 88 Posts : తొలిసారిగా తెలంగాణ సమాచార శాఖలో 88 జాబ్స్
Telangana - 88 Posts : తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా సమాచార పౌర సంబంధాల శాఖలో పోస్టుల భర్తీ దిశగా అడుగు పడింది.
- By Pasha Published Date - 09:24 AM, Fri - 6 October 23
Telangana – 88 Posts : తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా సమాచార పౌర సంబంధాల శాఖలో పోస్టుల భర్తీ దిశగా అడుగు పడింది. రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖలో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఎట్టకేలకు మోక్షం కలిగింది. ఈ శాఖలోని 88 పోస్టుల భర్తీకి తెలంగాణ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం జీవో నెంబర్ 1384ను విడుదల చేసింది. ఈ పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను త్వరలోనే విడుదల చేయనుంది.
We’re now on WhatsApp. Click to Join
రాష్ట్రంలోని 33 జిల్లాలకుగానూ ప్రతి జిల్లాకు ఒక సహాయ పౌర సంబంధాల అధికారి, ఇద్దరు పబ్లిసిటీ అసిస్టెంట్లను నియమించాలని నిర్ణయించారు. హైదరాబాద్లోని కమిషనరేట్లో ఒక పబ్లిసిటీ అసిస్టెంట్ పోస్టును భర్తీ చేయనున్నారు. అర్హులైన వారిని వివిధ స్క్రీనింగ్ పరీక్షల ద్వారా ఈ పోస్టులకు ఎంపిక చేయనున్నారు.
Related News
Summer Holidays : తెలంగాణ విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
Summer Holidays: తెలంగాణ(Telangana)లో ఎండలు భగ్గుమంటున్నాయి. దీంతో ఉక్కపోత కూడా ఎక్కువైంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) విద్యార్థులకు వేసవి సెలవుల(Summer Holidays)ను ప్రకటించింది. రేపటి నుంచి అంటే ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. దీంతో.. వేసవి సెలవులను హాయిగా ఎంజాయ్ చేసేందుకు విద్యార్థులు సిద్ధమవుతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో హాఫ్ డ