Telangana : భారీ వర్షాల నేపథ్యంలో రేపు కూడా విద్యాసంస్థలకు సెలవు
రేపు (శుక్రవారం )కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది
- Author : Sudheer
Date : 27-07-2023 - 12:52 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ (Telangana Government) కీలక నిర్ణయం తీసుకుంది. రేపు (శుక్రవారం )కూడా విద్యాసంస్థలకు (Educational Institutions) సెలవు ప్రకటించింది. అల్పపీడన ప్రభావంతో వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు (Rains) పడుతున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో అనేక ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్నాయి. పలు చోట్ల రోడ్లు తెగిపోయి రవాణా వ్యవస్థ ఆగిపోయింది.
ఇక స్కూల్స్ , కాలేజీలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతుండడం తో బుధు , గురువారం విద్యాసంస్థలకు సెలవు (Holiday) ప్రకటించింది. అయితే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతుండడం తో రేపు కూడా సెలవును పొడగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గత గురువారం నుంచి శనివారం వరకు సెలవులు ఇచ్చిన విషయం తెలిసిందే. వర్షాలు తగ్గడంతో సోమవారం నుంచి పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. మళ్లీ వర్షాలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది.
ఇక భారీ వరదలపై గురువారం ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్ (CM KCR).. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు రేపు సెలవు ప్రకటించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఆదేశించారు. శనివారం మొహర్రం సెలవు కావడంతో ప్రభుత్వ విద్యాసంస్థలు అన్నీ సోమవారం తెరుచుకోనున్నాయి.
Read Also: GHMC High Alert: ఇండ్లలోనే ఉండండి, బయటకు రాకండి.. సిటీ జనాలకు GHMC అలర్ట్