Telangana Global Summit: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్.. ప్రధాని మోదీ, రాహుల్ గాంధీలను కలిసిన సీఎం రేవంత్!
గ్లోబల్ సమ్మిట్ సన్నాహాలు వేగవంతంగా కొనసాగుతున్నాయి. సీఎం రేవంత్.. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కూడా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ వర్ధమాన ప్రాధాన్యతలు, ఈ ఈవెంట్‌లో సమర్పించబోయే విజన్ డాక్యుమెంట్ గురించి సీఎం వివరించారు.
- By Gopichand Published Date - 03:51 PM, Wed - 3 December 25
Telangana Global Summit: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి న్యూ ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8, 9 తేదీల్లో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు రావాల్సిందిగా ఆయనను లాంఛనంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. సమావేశంలో వివిధ రంగాల నిపుణులతో విస్తృత సంప్రదింపుల తర్వాత సిద్ధం చేసిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ గురించి ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి వివరించారు. 2047 నాటికి $3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి రాష్ట్రం రోడ్‌మ్యాప్‌ను, అన్ని రంగాలలో అభివృద్ధి ప్రణాళికలను ఆయన వివరించారు.
రాష్ట్రానికి సంబంధించిన కింది ముఖ్య ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం సహకారం, మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-2 విస్తరణ (162.5 కి.మీ) కోసం ఉమ్మడి ప్రాజెక్టుగా అంచనా వేసిన రూ. 43,848 కోట్ల వ్యయాన్ని ఆమోదించాలని సీఎం కోరారు. హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేబినెట్, ఆర్థిక ఆమోదాలు, అలాగే దక్షిణ విభాగానికి అనుమతి ఇవ్వాలని అభ్యర్థించారు. రీజినల్ రింగ్ రైల్ ప్రాజెక్ట్‌ను వీలైనంత త్వరగా చేపట్టాలని, హైదరాబాద్-మచిలీపట్నం (అమరావతి మీదుగా) వరకు 12-లేన్ల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే, హైదరాబాద్-బెంగళూరు హై-స్పీడ్ కారిడార్ కోసం గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వేకు ప్రత్యేక మద్దతు అందించాలన్నారు. కనెక్టివిటీ కోసం మన్ననూర్ నుండి శ్రీశైలం వరకు నాలుగు-లేన్ల ఎలివేటెడ్ కారిడార్‌కు ఆమోదం కావాలని సీఎం ప్రధానికి తెలిపారు.
Chief Minister Sri @revanth_anumula, along with Deputy Chief Minister Sri @Bhatti_Mallu, met Hon’ble Prime Minister Sri @narendramodi in New Delhi and formally invited him to the Telangana Rising Global Summit on December 8–9 at Bharat Future City.
A specially designed invitation… pic.twitter.com/sdX2BQ5luT— TelanganaRisingGlobalSummit (@GlobalSummitTG) December 3, 2025
Also Read: Yarlagadda VenkatRao : అరాచక పాలన అంతం, అభివృద్ధికి పట్టం – ఎమ్మెల్యే యార్లగడ్డ
కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క లోక్‌సభలో గౌరవ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఎంపీ శ్రీమతి ప్రియాంక గాంధీ వాద్రాను కూడా కలిసి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానాన్ని అందించారు.
Hon’ble Chief Minister Sri @revanth_anumula and Hon’ble Deputy Chief Minister Sri @Bhatti_Mallu , met Hon’ble Leader of the Opposition in Lok Sabha Sri @RahulGandhi and Congress General Secretary & MP Smt. @priyankagandhi to extend an invitation to the Telangana Rising Global… pic.twitter.com/8eFZuKctrO
— TelanganaRisingGlobalSummit (@GlobalSummitTG) December 3, 2025
ఇతర కేంద్ర మంత్రులతో సమావేశాలు
గ్లోబల్ సమ్మిట్ సన్నాహాలు వేగవంతంగా కొనసాగుతున్నాయి. సీఎం రేవంత్.. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కూడా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ వర్ధమాన ప్రాధాన్యతలు, ఈ ఈవెంట్‌లో సమర్పించబోయే విజన్ డాక్యుమెంట్ గురించి సీఎం వివరించారు. సమ్మిట్‌కు ముందు రాష్ట్ర అభివృద్ధి రోడ్‌మ్యాప్‌ను, విజన్ డాక్యుమెంట్‌ను సమర్పించే ఈ కార్యక్రమం కోసం దేశంలోని కీలక జాతీయ నాయకులను ఆహ్వానించే ప్రయత్నంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కూడా లాంఛనంగా ఆహ్వానించారు.