HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Formation Day Revanth Speech

Telangana Formation Day : రాష్ట్రం ఏర్పడి పదేళ్లయినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు – సీఎం రేవంత్

Telangana Formation Day : కోటి మంది మహిళలను ఆర్థికంగా స్వయం సమృద్ధులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో రూ. 21,000 కోట్ల సున్నా వడ్డీ రుణాలు మంజూరు చేశారు

  • Author : Sudheer Date : 02-06-2025 - 11:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Revanth Speech
Revanth Speech

ప్రత్యేక రాష్ట్రం వచ్చి పదేళ్లు అయినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని సీఎం రేవంత్ (CM Revanth) అన్నారు. పరేడ్ గ్రౌండ్లో జరిగిన కార్యక్రమం(Telangana Formation Day)లో ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్ల అధిపత్యాన్ని తిరస్కరించి ప్రజలు ప్రజాప్రభుత్వాన్ని ఎంచుకున్నారని , తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. మహిళల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా హామీలను అమలు చేస్తోందన్నారు.

ఇళ్లులేని పేదల కోసం “ఇందిరమ్మ ఇళ్లు” పథకాన్ని మొదలుపెట్టిన ప్రభుత్వం, మొదటి ఏడాదిలోనే 4.5 లక్షల మందికి ఇళ్లు మంజూరు చేసి, ఈ పథకానికి రూ. 22,500 కోట్లు కేటాయించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ కొనసాగుతోంది. అంతేకాక హైదరాబాద్ పరిధిలో 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ నగర అభివృద్ధి ప్రాజెక్టు ద్వారా పెట్టుబడులు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం ఆశిస్తోంది.

CM Chandrababu : తెలుగు జాతి తిరుగులేని శక్తిగా నిలవాలి

రాష్ట్రంలో మొదటిసారిగా కులగణన చేపట్టిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కింది. వందేళ్లలో జరగని ఈ కీలక చర్య దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ కులసర్వే ప్రభావంతో కేంద్ర ప్రభుత్వం కూడా కదిలిపోయి, వచ్చే జనగణనలో కులగణనను చేర్చనున్నట్లు ప్రకటించింది. భూ వివాదాలను నివారించేందుకు భూభారతి అనే డిజిటల్ ప్లాట్‌ఫాం తీసుకొస్తున్నట్లు సీఎం తెలిపారు. ఉద్యోగ నియామకాల్లో తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో ఉందని, నిరుద్యోగుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

Cabinet : కేబినెట్ లోకి రాములమ్మ..ఢిల్లీ ఫైనల్ లిస్ట్ ఇదేనా..?

మహిళలు, విద్యార్థులు, రైతులు వంటి విభిన్న వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. కోటి మంది మహిళలను ఆర్థికంగా స్వయం సమృద్ధులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో రూ. 21,000 కోట్ల సున్నా వడ్డీ రుణాలు మంజూరు చేసాం . మహిళా సంఘాలకు QR కోడ్ కార్డులు ఇచ్చి, ఆరోగ్య పరీక్షలు ఉచితంగా నిర్వహించే పథకం చేపట్టాం. విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్‌లు అందిస్తున్నాం . అదే విధంగా, రైతులకు రూ. 2 లక్షల లోపు రుణాలు మాఫీ చేయడంతో పాటు, సన్నవడ్లు పండించిన రైతులకు క్వింటాల్‌కు రూ. 500 బోనస్ అందిస్తున్నాం . ఈ చర్యల ద్వారా ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యంగా ముందడుగు వేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanth Reddy Speech
  • Telangana formation day
  • Telangana Formation Day Celebrations

Related News

During Telangana Formation Day celebrations, CM Revanth Reddy delivers good news to the unemployed.

Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో.. నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్

తెలంగాణ 12వ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు తీపి కబురు అందించారు. ఈ నెలలోనే TGPSC ద్వారా ఇంజనీరింగ్, విద్యా, అటవీ, టౌన్ ప్లానింగ్ శాఖల్లో మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. తమ 30 నెలల కాంగ్రెస్ పాలనలో ఇప్పటికే 67 వేల ఉద్యోగాలను పారదర్శ

  • Janasena Pawan Kalyan

    Pawan Kalyan: తెలంగాణ ప్రజలకు పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు

  • Telangana Formation Day

    Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం : సీఎం రేవంత్ రెడ్డి

  • Pawan Kalyan Must Hold a Meeting Only After Apologizing: Minister Ponnam Expresses Anger

    Ponnam prabhakar: పవన్‌ కల్యాణ్‌ క్షమాపణ చెప్పాకే సభ పెట్టుకోవాలి: మంత్రి పొన్నం ఆగ్రహం

Latest News

  • Pawan Kalyan: తెలంగాణలో పోటీ చేస్తాం పవన్ కళ్యాణ్

  • TDP MLAs: తప్పులు చేస్తే ఊరుకునేది లేదు.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్

  • Annamalai: బీజేపీకి అన్నామలై రాజీనామా

  • Kangana Ranaut: కంగనా రిక్వెస్ట్.. నేషనల్ క్రష్ ట్యాగ్‌ను అంగీకరించని నటి గిరిజా ఓక్

  • Donald Trump Tariff: భారత్‌పై టారిఫ్స్ 25% నుంచి 15% తగ్గింపు : ట్రంప్ కీలక నిర్ణయం

Trending News

    • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd