Farmers: తెలంగాణ `వరి ధాన్యం` కర్నాటక కొనుగోలు
వరి ధాన్యం కొనుగోలుపై టీఆర్ఎస్, బీజేపీ చేస్తోన్న హడావుడి కారణంగా పలు జిల్లాల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
- By CS Rao Published Date - 04:54 PM, Wed - 17 November 21

వరి ధాన్యం కొనుగోలుపై టీఆర్ఎస్, బీజేపీ చేస్తోన్న హడావుడి కారణంగా పలు జిల్లాల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో ఇతర రాష్ట్రాల సరిహద్దుల్లోని గ్రామ రైతులు నష్టపోతున్నారు. ప్రత్యేకించి కర్నాటక సరిహద్దులో ఉన్న మహబూబ్ నగర్ జిల్లా రైతులు ఆ రాష్ట్రానికి విక్రయించుకోలేకపోతున్నారు. గద్వాల్, కొత్తకోట సరిహద్దు ప్రాంతాలకు వచ్చే కర్నాటక దళారులు వరి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. తాజాగా రాజకీయ పార్టీల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో వాళ్లు రావడంలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.
నల్గొండ జిల్లాకు చెందిన రైతులు పొరుగు రాష్ట్రమైన కర్ణాటక, ప్రధానంగా రాయచూర్‌కి తీసుకెళ్లి వరి, బియ్యం అమ్ముకుంటున్నారు. కనీస మద్దతు ధర రూ.1,940 ఉండగా క్వింటాల్ 1800 వందలకు అక్కడ కొనుగోలు చేస్తున్నారు. అదే బాయిల్డ్ రైస్ క్వింటాల్‌కు రూ.1,300లకు అమ్ముకుంటున్నారు రైతులు. పెద్దఎత్తున అప్పులు చేసిన రైతులు పొరుగు రాష్ట్రానికి వెళ్లి వరి ధాన్యం అమ్ముకుంటున్నారు.
Also Read: రక్షణ రంగంలోకి నూతన నౌకలు
“రాయచూర్ మరియు కర్ణాటకలోని ఇతర సరిహద్దు ప్రాంతాల్లో వరి పంట సిద్ధంగా లేకపోవడంతో అక్కడ బియ్యం విక్రయాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా పరిస్థితిని అవకాశంగా తీసుకుని స్థానికంగా ఉన్న కొందరు డీలర్లు రైతుల నుంచి తక్కువ ధరకు వరిని కొనుగోలు చేస్తున్నారు. “ముఖ్యంగా వర్షాలు కురుస్తున్నందున, చాలా మంది రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద పెద్దఎత్తున వరి కుప్పలను వదిలివేస్తున్నారు. వరి క్వింటాల్ రూ.1500కు విక్రయిస్తుండటంతో ఇతర రాష్ట్రాల దళారులు భారీ వస్తున్నారు. కనీసం వాళ్లకైన అమ్ముకుని అప్పులు తీర్చుకోవడానికి సిద్ధమవుతున్న రైతులకు ఇప్పుడు టీఆర్ఎస్, బీజేపీ చేస్తోన్న రాద్ధాంతం ఆటంకంగా మారింది.
Related News

30 Elephants Entry : 30 ఏనుగుల ఎంట్రీ.. పది గ్రామాల్లో హై అలర్ట్
30 Elephants Entry : ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 30 ఏనుగులు కర్ణాటక బార్డర్‌లోని అడవుల నుంచి తమిళనాడులోని డెంకనికోట్టై రిజర్వ్ ఫారెస్టులోకి ప్రవేశించాయి.