Telangana Election 2023- BJP Manifesto : ‘సకల జనుల సౌభాగ్య తెలంగాణ’ పేరుతో బిజెపి మేనిఫెస్టో విడుదల
ఈ మేనిఫెస్టో లో 10 అంశాలను పొందుపర్చారు. ధరణి స్థానంలో 'మీభూమి' యాప్, కేంద్ర పథకాల అమలు కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ, గల్ఫ్ బాధితుల కోసం నోడల్ ఏజెన్సీ, రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై విచారణకు కమిషన్
- Author : Sudheer
Date : 18-11-2023 - 7:52 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు ఉచిత హామీలను కురిపిస్తున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ బిఆర్ఎస్ (BRS) , కాంగ్రెస్ పార్టీ (Congress)లు తమ తమ మేనిఫెస్టో (Manifesto) లను విడుదల చేసి జనాల్లోకి వెళ్లగా..తాజాగా నేడు శనివారం బిజెపి ‘సకల జనుల సౌభాగ్య తెలంగాణ’ పేరుతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేతుల మీదుగా 10 అంశాలతో కూడిన మేనిఫెస్టోను ( BJP Manifesto) విడుదల చేశారు.
ఈ మేనిఫెస్టో లో 10 అంశాలను పొందుపర్చారు. ధరణి స్థానంలో ‘మీభూమి’ యాప్, కేంద్ర పథకాల అమలు కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ, గల్ఫ్ బాధితుల కోసం నోడల్ ఏజెన్సీ, రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై విచారణకు కమిషన్, 4 శాతం ముస్లిం రిజర్వేషన్ ఎత్తివేత, తెలంగాణలో ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తామని.. అన్ని పంటలకు పంట బీమాను తమ మేనిఫెస్టోలో పొందుపర్చించింది బీజేపీ.
మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు (Telangana Election 2023- BJP Manifesto) ఇవే..
1. ప్రజలందరికీ సుపరిపాలన – సమర్ధవంతమైన పాలన
2. వెనుకబడిన వర్గాల సాధికారత – అందరికీ చట్టం సమానంగా వర్తింపు
3. కూడు – గూడు : ఆహార, నివాస భద్రత
4. రైతే రాజు – అన్నదాతలకు అందలం
5. నారీ శక్తి – మహిళల నేతృత్వంలో అభివృద్ధి
6. యువశక్తి – ఉపాధి (యూపీఎస్సీ తరహాలో గ్రూప్ 1, 2 పరీక్షల నిర్వహణ)
7. విద్యాశ్రీ – నాణ్యమైన విద్య
8. వైద్యశ్రీ – నాణ్యమైన వైద్య సంరక్షణ
9. సంపూర్ణ వికాసం – పరిశ్రమలు, మౌలిక వసతులు
10. వారసత్వం – సంస్కృతి, చరిత్ర
- ధరణి స్థానంలో మీ భూమి యాప్
- గల్ఫ్ బాధితుల కోసం నోడల్ ఏజెన్సీ ఏర్పాటు
- ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రతి నెలా 1వ తేదీనే వేతనాలు
- బీఆర్ఎస్ పార్టీ అవినీతిపై విచారణకు కమిటీ
- 4 శాతం ముస్లింల రిజర్వేషన్ల రద్దు
- ఉమ్మడి పౌరస్మృతి ముసాయిదాకు కమిటీ
- ఎస్సీల వర్గీకరణకు సహకారం
- అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు
- అర్హత కలిగిన కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు
- ఎరువులు, విత్తనాల కొనుగోలుకు రూ.2,500 సాయం
- వరికి రూ.3,100 మద్దతు ధర
- ఆసక్తిగల రైతులకు ఉచితంగా దేశీయ ఆవుల పంపిణీ
- నిజామాబాద్‌లో టర్మరిక్ సిటీ అభివృద్ధి
- డిగ్రీ, ప్రొఫెషనల్ విద్యార్థినులకు ల్యాప్‌టాప్‌లు
- నవజాత బాలికలకు ఫిక్స్‌డ్ డిపాజిట్
- ఉజ్వల పథకం లబ్ధిదారులకు 4 ఉచిత గ్యాస్ సిలిండర్లు