HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Contract Employees Regularisation G O 16 Canceled By High Court

GO 16 : జీవో 16ను కొట్టేసిన హైకోర్టు.. జాబ్స్ రెగ్యులరైజ్ అయిన వేలాది మందికి టెన్షన్

అప్పట్లో విద్య, వైద్య శాఖలకు చెందిన దాదాపు 8వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్(GO 16) చేశారు.

  • Author : Pasha Date : 19-11-2024 - 6:26 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
HC strikes down GO 16

GO 16 : జీవో 16ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఈ జీవో ద్వారా దాదాపు 5వేల మందికిపైగా కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ తీసుకున్న నిర్ణయం చట్టపరంగా చెల్లదంటూ కీలక తీర్పును వెలువరించింది. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ అనేది రాజ్యాంగ విరుద్ధమని వెల్లడించింది. రాష్ట్రంలో ఇకపై కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయకుండా.. నోటిఫికేషన్ల ద్వారా మాత్రమే ఉద్యోగ నియామకాలను చేపట్టాలని  హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Also Read :Google Chrome Sale : అమెరికా న్యాయశాఖ వర్సెస్ గూగుల్.. క్రోమ్‌ బ్రౌజర్‌‌ను అమ్మేస్తారా ?

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హయాలో జీవో 16ను జారీ చేశాారు. దీని ద్వారా అప్పట్లో విద్య, వైద్య శాఖలకు చెందిన దాదాపు 5వేల మందికిపైగా కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్(GO 16) చేశారు. ఇలా జాబ్స్ రెగ్యులరైజ్ అయిన వారిలో ఎంతోమంది డిగ్రీ, జూనియర్‌, పాలిటెక్నిక్‌ కాలేజీల లెక్చరర్లు ఉన్నారు. అయితే ఈ జీవోను వ్యతిరేకిస్తూ  తెలంగాణ నిరుద్యోగుల జేఏసీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. జీవో 16 చట్టప్రకారం చెల్లదని తెలిపింది. ఈ తీర్పుతో గతంలో జీవో 16 ఆధారంగా రెగ్యులరైజ్ అయిన కాంట్రాక్టు ఉద్యోగులను ఆందోళనలు ఆవరించాయి. హైకోర్టు తీర్పు కారణంగా తమ భవిష్యత్తుకు ముప్పు వాటిల్లుతుందని వారు కలవరపడుతున్నారు. దీనిపై తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది ? బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగాలు రెెగ్యులరైజ్ అయినా వేలాది మంది భవితవ్యం విషయంలో రేవంత్ సర్కారు  ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Also Read :Gold Loan EMI : ఇక గోల్డ్ లోన్స్‌కూ ‘ఈఎంఐ’ ఆప్షన్స్.. ఎలా అంటే..

ఏయే శాఖలో ఎంతమందిని రెగ్యులరైజ్ చేశారంటే..

  • గత బీఆర్ఎస్ హయాంలో తెలంగాణలోని మొత్తం 40 విభాగాలకు చెందిన 5,544 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశారు. దీనికి సంబంధించి అప్పట్లో జీవో 16ను జారీ చేశారు.
  • ఆనాడు జాబ్స్ రెగ్యులరైజ్ అయిన కాంట్రాక్టు ఉద్యోగుల్లో 2,909 మంది జూనియర్‌ లెక్చరర్లు, 184 మంది జూనియర్ లెక్చరర్లు(ఒకేషనల్‌), 390 మంది పాలిటెక్నిక్‌, 270 మంది డిగ్రీ లెక్చరర్లు ఉన్నారు.
  • సాంకేతిక విద్యాశాఖలోని 131 మంది అటెండర్లు, వైద్య ఆరోగ్యశాఖలోని 837 మంది వైద్య సహాయకులు, 179 మంది ల్యాబ్‌ టెక్నీషియన్లు, 158 మంది ఫార్మసిస్టులు, 230 మంది సహాయ శిక్షణ అధికారులు ఉన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Contract Employees Regularisation
  • GO 16
  • High Court
  • jobs
  • telangana
  • Telangana Contract Employees

Related News

Bail granted to Bandi Bhagirath.

Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన పోక్సో (POCSO) కేసులో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథకు లీగల్ పరంగా పెద్ద ఉపశమనం లభించింది. భగీరథ్ దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు గురువారం ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఇరుపక్షాల సుదీర్ఘ వాదనలు విన్న అనంతరం హైకోర్టు తుది తీర్పు

  • Good news for unemployed youth in Telangana: Green signal for RTC conductor posts.

    Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

  • Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

    ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

  • Alcohol: మందు కొడితే మంచి నిద్ర వస్తుందా..? నిజమెంత?

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd