Meenakshi Natarajan : మీనాక్షి నటరాజన్ పై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ల గుర్రు..?
Meenakshi Natarajan : ప్రభుత్వ విధానాలపై ఆమె జోక్యం చూపుతుండటం కొందరు కాంగ్రెస్ సీనియర్లకు(Congress Seniors) అసహనం కలిగిస్తోంది
- By Sudheer Published Date - 04:35 PM, Tue - 8 April 25

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌గా నియమితులైన మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) చురుకుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ పునర్వ్యవస్థీకరణ, శాంతి భద్రతలు, ప్రభుత్వ విధానాలపై ఆమె జోక్యం చూపుతుండటం కొందరు కాంగ్రెస్ సీనియర్లకు(Congress Seniors) అసహనం కలిగిస్తోంది. పార్టీలో పదవుల కోసం ప్రయత్నిస్తున్న నేతలకు ఆమె విధానం అడ్డుగా మారింది. ముఖ్యంగా లాబీయింగ్ ద్వారా పదవులు ఆశించే నేతలకు ఆమె స్పష్టంగా నిరాకరణ తెలియజేయడంతో అసంతృప్తి పెరిగింది.
Patel Vs RSS : ఆర్ఎస్ఎస్‌తో పటేల్‌కు సంబంధమేంటి.. హైజాక్ పాలిటిక్స్‌పై ఖర్గే భగ్గు
ఇటీవల HCU భూ వివాదం(HCU land dispute)పై మంత్రులతో మీనాక్షి నిర్వహించిన భేటీ వివాదాస్పదమైంది. ఆమె ఏ హోదాలో సెక్రటేరియట్‌లో సమావేశం నిర్వహించారని బీఆర్ఎస్ ప్రశ్నిస్తుండగా, కాంగ్రెస్ సీనియర్లలో కొందరు కూడా అదే ప్రశ్న లేవనెత్తడం చర్చనీయాంశమైంది. పార్టీ వ్యవహారాలతో పాటు ప్రభుత్వ వ్యవహారాల్లోనూ మీనాక్షి జోక్యం చూపడాన్ని కొందరు నేతలు సహించలేకపోతున్నారు. తాము పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా కష్టపడుతున్నా, తగిన గుర్తింపు లేకుండా మీనాక్షి ఒకే నిర్ణయాలతో పదవులు ఖరారు చేస్తున్నారని భావిస్తున్నారు.
మొదట్లో మీనాక్షిని మెచ్చుకున్న నేతలు ఇప్పుడు ఆమెపై విమర్శలు చేస్తున్నారు. రాహుల్ గాంధీ కోర్ టీమ్‌లోని ఈ కీలక నేత తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించడంతో, పలువురు సీనియర్ నేతలు తమ ప్రయత్నాలు ఫలించవని భావిస్తున్నారు. దీంతో ఆమెను టార్గెట్ చేస్తూ విమర్శలు పెంచుతున్నారు. లాబీయింగ్‌కు తలొంచకుండా, కష్టపడిన వారికే గుర్తింపు ఇస్తామన్న మీనాక్షి విధానం పార్టీలో ఒడిదుడుకులు తేవచ్చన్న భావన వ్యక్తమవుతోంది.