CM KCR: దేశ, రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
వసంత రుతువుకు నాందిని పురస్కరించుకుని పచ్చని రెమ్మలతో మళ్లీ ప్రారంభం కానున్న ప్రకృతి చక్రానికి హోలీ పండుగ స్వాగతం పలుకుతుందని సీఎం కేసీఆర్ (CM KCR) అన్నారు.
- By Gopichand Published Date - 08:10 AM, Tue - 7 March 23

వసంత రుతువుకు నాందిని పురస్కరించుకుని పచ్చని రెమ్మలతో మళ్లీ ప్రారంభం కానున్న ప్రకృతి చక్రానికి హోలీ పండుగ స్వాగతం పలుకుతుందని సీఎం కేసీఆర్ (CM KCR) అన్నారు. కొత్త ఆశలతో తమ జీవితాల్లో కొత్తదనాన్ని హోలీ రూపంలో స్వాగతించే భారతీయ సంప్రదాయం ఎంతో అందంగా ఉంటుందన్నారు. రాష్ట్ర, దేశ ప్రజలందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ హోలీ పూర్ణిమ శుభాకాంక్షలు తెలిపారు. భిన్నాభిప్రాయాలను పక్కనబెట్టి సహజ రంగులతో హోలీ పండుగను జరుపుకోవాలని సీఎం కెసిఆర్ కోరారు. హోలీ పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం మార్చి 7వ తేదీని సెలవు దినంగా ప్రకటించింది.
హోలీ పండుగ నేపథ్యంలో చంద్రన్న నవరాత్రుల సందర్భంగా చిన్నారులు జాజిరి ఆట, కోలాటాల చప్పట్లతో గ్రామాలన్నీ పులకిస్తున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. చిన్నపిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ఖేలి కేరింతలతో సాగే హోలీ మానవ జీవితం ఒక వేడుకగా భావించి ప్రకృతితో మమేకమై జీవించే తత్వాన్ని ఇస్తుందని అన్నారు.
Also Read: Gold And Silver Price Today: స్థిరంగా బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలివే..!
హోలీ పండుగను ప్రజలందరూ సహజసిద్ధమైన బంతిపూల వంటి రంగులతో విబేధాలు విడనాడి పరస్పర ప్రేమను చాటుకోవాలని సీఎం సూచించారు. స్వరాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రగతి పథంలో దళిత బహుజనులతో పాటు తెలంగాణ ప్రజలందరి జీవితాల్లో చిరకాల వసంతాలు నింపారని సీఎం అన్నారు. దేశంలోని ప్రజలందరి జీవితాల్లో కొత్త జీవితం వెల్లివిరిసే వరకు తమ కృషి కొనసాగుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

Related News

KTR: రేవంత్, బండి సంజయ్ పై కేటీఆర్ రూ. 100 కోట్ల పరువు నష్టం దావా.. వారం రోజులే గడువు..!
టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంలో తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ (KTR) రూ.100 కోట్ల పరువు నష్టం నోటీసును మంగళవారం అందజేశారు.