Castes Census : ఇంకా మీ కులగణన సర్వే కాలేదా.. ఇలా చేయండి.. ఇవాళే లాస్డ్ డేట్..
Castes Census : తెలంగాణలో కుల గణన సర్వే నేటితో ముగియనుంది. ఇంకా సర్వేలో పాల్గొనని వారు, ఎన్యుమరెటర్లకు తమ వివరాలు అందించని వారు వెంటనే సర్వేలో పాల్గొనాలని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.
- By Kavya Krishna Published Date - 10:31 AM, Fri - 28 February 25

Castes Census : తెలంగాణలో కుల గణన సర్వే నేటితో ముగియనుందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇంకా సర్వేలో పాల్గొనని వారు, ఎన్యుమరేటర్లకు తమ వివరాలు అందించని వారు వెంటనే సర్వేలో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ జనాభా లెక్కల్లో వారి భాగస్వామ్యం ఉండాలంటే, కుల గణన సర్వేలో తప్పక పాల్గొనాలని మంత్రి చెప్పారు. ఈ సర్వే కీలకమైనదని, దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలని విజ్ఞప్తి చేశారు మంత్రి పొన్నం. కుల గణన సర్వేలో భాగస్వామ్యం అవ్వడం ద్వారా ప్రజల ఆర్ధిక, సామాజిక స్థితి, అభివృద్ధి సాధనల గురించి సమగ్రంగా తెలియజేయవచ్చు. ఈ ప్రక్రియలో ప్రతి ఒక్కరి సహకారం చాలా అవసరమని ఆయన అన్నారు.
కుల గణన సర్వేను సమర్థవంతంగా నిర్వహించేందుకు, తెలంగాణ ప్రభుత్వం క్రమం తప్పకుండా చర్యలు తీసుకుంది. జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో ఉన్న కుల సంఘాలు, బీసీ సంఘాల నేతలు, మేధావులు, ఫ్రొఫెసర్లు తదితరులు ఈ అంశంపై మరింత అవగాహన కల్పించేందుకు ముందుకు రావాలని మంత్రిగారు సూచించారు. అందరి కృషి , సహకారం ద్వారా ఈ సర్వే విజయవంతంగా పూర్తి చేయగలుగుతామని ఆయన అన్నారు.
National Science Day : సివి రామన్ , జాతీయ సైన్స్ దినోత్సవం మధ్య సంబంధం ఏమిటి..?
కుల గణన సర్వేలో పాల్గొనని వారు, ఈ రోజు (గడువు ముగియన రోజు) తమ వివరాలు ఇవ్వడానికి వెనుకాడకుండా, ఆన్‌లైన్, ఎన్‌యుయుమరేటర్ల ద్వారా వివరాలు అందించవలసిన అవసరం ఉందని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఈ గడువులో ప్రత్యేకంగా, సర్వేలో పాల్గొనని వారికి 16 నుండి 28 వరకు అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. నేటితో ఈ అవకాశం ముగియనుంది.
మంత్రిగారు సూచించిన విధంగా, ఈ సర్వేలో భాగస్వామ్యం అవ్వాలనుకుంటే, సమీప ఎంపీడీవో కార్యాలయాలు, వార్డు ఆఫీసులలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కౌంటర్ల ద్వారా తమ వివరాలను నమోదు చేయవచ్చు. వీరు, సర్వేలో పాల్గొనలేదని ఫోన్ ద్వారా తెలియజేసిన వారు, వారి ఇంటికి వెళ్లి ఎన్యుమరేటర్లు వారికి వివరాలు నమోదు చేస్తారు.
ఇటువంటి కార్యాచరణ ద్వారా, వారు తమ సమాచారాన్ని సులభంగా అందించవచ్చని మంత్రిగారు తెలిపారు. అంతేకాక, ప్రభుత్వం ఆన్‌లైన్ లో నమోదు చేసుకునే అవకాశాన్ని కూడా అందించింది. https://seeepcsurvey.cgg.gov.in ద్వారా ఈ సర్వేలో పాల్గొనవచ్చు. సమగ్ర జనాభా లెక్కలలో తెలంగాణ రాష్ట్రం యొక్క అన్ని వర్గాల సహకారం అవసరం. అందువల్ల, ఈ కుల గణన సర్వేలో పాల్గొనాలని మంత్రిగారు తన చివరి విజ్ఞప్తి చేశారు.
Gold Price Today : మగువలకు గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు..!