HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Cabinet Decisions

Telangana Cabinet Decisions : తెలంగాణ క్యాబినెట్ నిర్ణయాలు

Telangana Cabinet Decisions : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన మంత్రిమండలి సమావేశం సుదీర్ఘంగా నాలుగు గంటల పాటు జరిగింది

  • Author : Sudheer Date : 25-11-2025 - 5:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telangana Cabinet
Telangana Cabinet

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన మంత్రిమండలి సమావేశం సుదీర్ఘంగా నాలుగు గంటల పాటు జరిగింది. ఈ భేటీలో పలు ముఖ్యమైన అంశాలపై చర్చించి, కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మంత్రి శ్రీధర్ బాబు మీడియాకు వివరించిన వివరాల ప్రకారం.. ఈ నిర్ణయాల్లో ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిని విస్తరించడం ఒకటి. ఔటర్ రింగ్ రోడ్డు (ORR) ను ఆనుకుని ఉన్న 27 మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను GHMC లో విలీనం చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది. ఈ విలీనంతో హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధి గణనీయంగా పెరుగుతుంది, పాలన వికేంద్రీకరణ, మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. పెద్ద అంబర్ పేట్, జల్‌పల్లి, శంషాబాద్, మణికొండ, తుక్కుగూడ వంటి కీలక ప్రాంతాలు ఇకపై GHMC పరిధిలోకి రానున్నాయి.

Shreyas Iyer: జిమ్‌లో సైక్లింగ్ మొదలుపెట్టిన భారత వైస్-కెప్టెన్!

విద్యుత్ రంగానికి సంబంధించి మంత్రి మండలి మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా మూడవ విద్యుత్ డిస్కం (డిస్ట్రిబ్యూషన్ కంపెనీ) ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఉన్న రెండు డిస్కంలకు అదనంగా ఏర్పాటు కానున్న ఈ కొత్త డిస్కం పరిధిలోకి ముఖ్యంగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మరియు లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు వస్తాయి. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా, భారీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణ భారాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రత్యేక డిస్కం ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా విద్యుత్ సరఫరా వ్యవస్థలో మరింత సమర్థత, పారదర్శకత తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే, రాష్ట్ర అవసరాల కోసం 3 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు కూడా మంత్రిమండలి ఆమోదం తెలిపింది. NTPC ఆధ్వర్యంలో రామగుండంలో థర్మల్ పవర్ ప్రాజెక్టును చేపట్టేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Nepal Currency: ఇకపై చైనాలో నేపాల్ కరెన్సీ ముద్రణ.. భారతదేశం ఎందుకు వైదొలిగింది?

మరోవైపు హైదరాబాద్ నగరంలో విద్యుత్ సరఫరా వ్యవస్థను మెరుగుపరచడానికి ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌ను మూడు సర్కిళ్లుగా విభజించి అండర్ గ్రౌండ్ కేబుల్ విద్యుత్ వ్యవస్థను చేపట్టాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఈ అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థ ద్వారా వాతావరణ పరిస్థితుల వల్ల కలిగే అంతరాయాలు తగ్గుతాయి, నగరంలో విద్యుత్ సరఫరా మరింత సురక్షితంగా, నమ్మదగినదిగా మారుతుంది. ఈ ముఖ్య నిర్ణయాలు రాష్ట్ర పరిపాలన, మౌలిక సదుపాయాలు మరియు విద్యుత్ రంగంలో గణనీయమైన మార్పులు తీసుకురానున్నాయి. ఈ నిర్ణయాల అమలుకు సంబంధించిన విధివిధానాలపై ప్రభుత్వం దృష్టి సారించనుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm revanth
  • Congress Govt
  • GHMC
  • telangana cabinet
  • Telangana Cabinet Decisions

Related News

Cm Revanth Messi

Messi & Revanth Match : ఇది మరిచిపోలేని క్షణం – రేవంత్ రెడ్డి

Messi & Revanth Match : ముఖ్యమంత్రి భాగస్వామ్యం వహించిన సింగరేణి ఆర్ఆర్ జట్టు చివరకు మెస్సీ జట్టుపై విజయం సాధించింది. ముఖ్యమంత్రి స్వయంగా ఆటలో పాల్గొనడం మరియు గోల్ సాధించడం వంటి అంశాలు ఈ మ్యాచ్‌ను

  • Revanth Reddy Became A Pois

    Gurukul Hostel Food : గురుకుల పాఠశాల విద్యార్థులుకు విషంగా మారిన రేవంత్ – హరీశ్ రావు

  • Ratan Tata Greenfield Road

    Greenfield Highway Works : తెలంగాణలో మరో గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులు ప్రారంభం

  • Revanth=rahul Priyanka

    CM Revanth : నేడు ఢిల్లీ లో కాంగ్రెస్ పెద్దలతో సీఎం రేవంత్ భేటీ

  • Revanth Ou

    CM Revanth to Visit OU : ఓయూకు రూ.1000కోట్లు మంజూరు చేసిన సీఎం రేవంత్

Latest News

  • ఈ ఏడాది నెటిజన్లు అత్యధికంగా వెతికిన బిజినెస్ లీడర్లు వీరే!

  • ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆట‌గాళ్లు వీరే!

  • యువ ఆట‌గాళ్ల‌పై కాసుల వ‌ర్షం.. ఎవ‌రీ కార్తీక్ శ‌ర్మ‌, ప్ర‌శాంత్ వీర్‌?

  • ఆస్ట్రేలియాలో కాల్పుల ఘ‌ట‌న‌.. అనుమానితుడు హైద‌రాబాద్ వాసి!

  • జనవరి నెలలో శుభ ఘడియలు ఇవే!

Trending News

    • మతీషా పతిరానాను రూ. 18 కోట్లకు దక్కించుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్

    • రికార్డు ధరకు అమ్ముడైన కామెరాన్ గ్రీన్.. రూ. 25.20 కోట్లకు దక్కించుకున్న కేకేఆర్!

    • ఐపీఎల్ 2026 మినీ వేలం.. ఏమిటీ ఆర్‌టీఎం కార్డ్? ఈ వేలంలో దీనిని వాడొచ్చా?

    • ఐపీఎల్ 2026 మినీ వేలం.. మరోసారి హోస్ట్‌గా మల్లికా సాగర్, ఎవ‌రీమె!

    • నేడు ఐపీఎల్ 2026 మినీ వేలం.. పూర్తి వివ‌రాలీవే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd