HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Bjp President Bandi Sanjay Made Sensational Comments On Cm Kcr

Bandi Sanjay : బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..కేసీఆర్ క్షుద్ర పూజలు చేస్తున్నారంటూ..!!

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ క్షుద్ర పూజలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

  • Author : hashtagu Date : 08-10-2022 - 4:14 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ క్షుద్ర పూజలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తాంత్రికుడి సలహా మేరకే టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చారని పేర్కొన్నారు. తాంత్రికుడి సూచనతోనే సచివాలయానికి వెళ్లడం లేదని, ఫాంహౌజ్ లో నిత్యం నల్ల పిల్లితో క్షుద్ర పూజలు చేస్తున్నారని తెలిపారు. ఈ విషయం తనకు ఓ స్వామిజీ తెలిపారని… కేసీఆర్ చేస్తున్న పనులు, గత చరిత్రను విశ్లేషించిన తరువాతే వాస్తవాలన్నీ రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే ఈ విషయం చెబుతున్నానన్నారు. స్వామిజీలు, వేద పండితులతోపాటు సమాజ హితం కోరే వాళ్లంతా కేసీఆర్ క్షుద్ర పూజల నుండి తెలంగాణను కాపాడాలని వేడుకుంటున్నట్లు తెలిపారు.

బండి సంజయ్ వ్యాఖ్యలివి..

• బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్, తమిళనాడు సహ ఇంచార్జీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ తదితరులతో కలిసి బండి సంజయ్ సమక్షంలో లింగాల హరిగౌడ్ ఆధ్వర్యంలో మలక్ పేట నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు బీజేపీలో చేరారు. వారికి కండువా కప్పి స్వాగతం పలికిన బండి సంజయ్ అనంతరం మీడియాతో మాట్లాడారు. అందులోని ముఖ్యాంశాలు…

• మలక్ పేట నియోజకవర్గంలో టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి ప్రజలను రాచి రంపాన పెడుతున్నాయి. అరాచకాలకు పాల్పడుతున్నాయి. మైనారిటీ సంతుష్టీకరణ విధానాలకు విసిగిపోయి ప్రధాని నరేంద్ర మోడీ సిద్ధాంతాలను నమ్మి బీజేపీలో చేరిన లింగాల హరిగౌడ్ కు హ్రుదయ పూర్వక స్వాగతం చెబుతున్నాం.

• ఈరోజు మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖారారు చేసిన జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాగారికి తెలంగాణ ప్రజల పక్షాన ధన్యవాదాలు. మంచి అభ్యర్ధిని మునుగోడులో పోటీ చేస్తున్నారు. ఎమ్మెల్యే పదవీ కాలం ఉన్నప్పటికీ మునుగోడు అభివ్రుద్ధి కోసం, కేసీఆర్ కుటుంబ అవినీతి-నియంత-అరాచక పాలనకు వ్యతిరేకంగా పదవికి రాజీనామా చేసి బీజేపీ అభ్యర్ధిగా రాజోగోపాల్ రెడ్డి పోటీ చేస్తున్నారు. మునుగోడు ప్రజల ఆశీర్వాదంతో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ అభ్యర్ధి భారీ మెజారిటీతో గెలవడం ఖాయం.

• ఈరోజు ఉదయమే ఓ స్వామిజీ కలిసిండు. పెద్దాయన. సర్వేజనా సుఖినోభవ అనే ధర్మాన్ని నమ్ముకుని మంచి జరగాలని పూజలు చేసే వ్యక్తి ఆయన. మొన్న ఆయన దగ్గరకు ఓ తాంత్రికుడు వచ్చి అసలు విషయం చెప్పిండట. కేసీఆర్ స్వలాభం కోసం ఎంతకైనా దిగజారుతాడని చెప్పిండు. ఏమైంది స్వామీజీ అని అడిగిన…

• ఆయనేమన్నడంటే… టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా ఎందుకు మార్చిండో తెలుసా? ఓ తాంత్రికుడి సూచనల మేరకే కేసీఆర్ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిండని చెప్పిండు. దానికి ముహూర్తం పెట్టింది కూడా ఆ తాంత్రికుడే అని చెప్పారు.

• కేసీఆర్ కు ప్రజల మీద, దేవుడి మీద నమ్మకం లేదు. తాంత్రికుడిని నమ్ముకుని దయ్యాల పూజలు, క్షుద్ర పూజలు చేస్తున్నడు.

• కేసీఆర్ ను మొదటి నుండి మీరు గమనించండి… సీఎం అయిన కొన్నాళ్త తరువాత ఇబ్బందులొస్తే… తాంత్రికుడి సూచన మేరకు అసలు సచివాలయానికే పోలేదు. అయినా జీహెచ్ఎంసీ, దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల్లో ఓడిపోయిండు.

• మళ్లీ తాంత్రికుడి వద్దకు పోతే… సచివాలయ వైబ్రేషన్స్ ఇంకా నీ మీద పడుతున్నయని చెప్పిండట. ఆయన సూచన మేరకే సచివాలయాన్ని కూల్చేసి ప్రజల సొమ్ముతో కొత్త సచివాలయాన్ని కడుతున్నడు.

• ఆ తరువాత ఫాంహౌజ్ లో సకుటుంబ సమేతంగా తాంత్రిక పూజలు చేసిండు. ఆ పూజల అనంతరం వాటిని కాళేశ్వరం పోయి ఆ నీళ్లలో కలిపిండు. పైకి మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించేందుకు వెళుతున్నానని చెప్పిండు.

• మీకింకో విషయం చెప్పాలి… ప్రతి 3 నెలలకోసారి నల్ల పిల్లితో పూజలు చేస్తడు. గతంలో ఫాంహౌజ్ లో ఒక యువకుడు అనుమానాస్పదంగా చనిపోయిండు. దీనిపై నోరు మెదపలేదు. ఆ కేసు ఏమైందో కూడా తెల్వదు.

• ఇవన్నీ అయిన తరువాత కూడా పరిస్థితి బాగుండటం లేకపోవడంతో తాంత్రికుడి సూచన మేరకు టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిండు… తన కోసం, తన కుటుంబం కోసం ఎవరు నాశనమైనా నష్టం లేదనే భావనతో క్షుద్ర పూజలు చేస్తుండు.

• మేం దేవుడిని, ప్రజలను, ప్రజా స్వామ్యాన్ని నమ్ముకున్నోళ్లం మేం. అందరం బాగుండాలని కోరే వాళ్లం. కేసీఆర్ మాత్రం తాను బాగుండాలి…ఇంకొకరు నాశనం కోరుకోవాలని కోరుకుంటున్నడు.

• క్షుద్ర పూజలు చేసినంత మాత్రాన మంచి జరుగుతుందా? తాంత్రికుడి మాటలు నమ్మి పూజలు చేసి డబ్బులు పంచినంత మాత్రాన గెలుస్తాననుకోవడం మూర్ఖత్వం..

• కేసీఆర్… ఫాంహౌజ్, ప్రగతి భవన్ దాటి బయటకు వెళ్లకపోవడానికి ప్రధాన కారణం. తాంత్రికుడే. ఆయన చేస్తున్న క్షుద్ర పూజలే కారణం. తాంత్రికుడు చెబితే బయట కాలు అడుగుపెడతడు.. లేకుంటే ఫాంహౌజ్ దాటడు…

• ఈ సందర్భంగా తెలంగాణలోని అర్చకులు, స్వామిజీలు… సమాజ హితం కోరుకునే వాళ్లందరికీ ఒక్కటే విజ్ఝప్తి చేస్తున్నా… కేసీఆర్ క్షుద్ర పూజల నుండి తెలంగాణను కాపాడాలని వేడుకుంటున్నా.

• ఈడీ దాడులపై అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ…. రాష్ట్రంలో ప్రభుత్వ భూములను కబ్జా చేసి అవినీతి, అక్రమాలు చేసి కోట్లు సంపాదిస్తూ… అవినీతి, హత్యలు, మాన భంగాలు చేస్తుంటే ఈడీ, సీబీఐ చూస్తూ ఊరుకుంటదా? లిక్కర్ స్కాంలో, చీకోటి పత్తాల స్కాంలో, డ్రగ్స్ కేసులో తన కుటుంబానికి సంబంధం లేదని కేసీఆర్ ఎందుకు చెప్పలేకపోతున్నరు? 2014 ఎన్నికల్లో సీఎం, మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమర్పించిన అఫిడవిట్లలో ఉన్న ఆస్తులెన్ని? ఇప్పుడు సంపాదించినవన్నో దమ్ముంటే బయటపెట్టండి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bandi Sanjay
  • bjp
  • brs
  • kcr

Related News

Ponguleti Srinivas Reddy Co

బిఆర్ఎస్ రెచ్చగొడుతుందంటూ పొంగులేటి ఫైర్

మార్పు పేరుతో బీఆర్ఎస్ నేతలు ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆయన మండిపడ్డారు. పరిపాలనా సౌలభ్యం కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, అయితే ప్రతిపక్షాలు రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల్లో లేనిపోని భయాలను సృష్టిస్తున్నాయని ఆయన ఆరోపించారు.

  • Pawan Janasena2

    జనసేనతో పొత్తు అవసరం లేదు – బీజేపీ స్పష్టం

  • Ktr Manuu

    బిఆర్ఎస్ కు లభించిన మరో అస్త్రం! కాంగ్రెస్ కు మరో తలనొప్పి తప్పదా ?

  • Minister Konda Surekha and Seethakka meets KCR

    మహిళా మంత్రులకు కేసీఆర్‌ ఆత్మీయ పలకరింపు..పసుపు, కుంకుమ, చీర, తాంబూలాలతో సత్కారం

  • Erravalli Farmhouse Seethakka, Konda Surekha,

    కేసీఆర్‌ను కలవనున్న మంత్రి సీతక్క,కొండా సురేఖ.. ఎందుకంటే?

Latest News

  • సంక్రాంతి శుభాకాంక్షలు 2026.. మీ స్నేహితులకు, బంధువులకు ఇలా స్పెషల్ కోట్స్, విషెస్‌తో చెప్పేయండి!

  • గాలిపటాలు ఎగురవేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!!

  • యూపీఐ పేమెంట్స్ వాడుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!!

  • నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు మూవీ రివ్యూ

  • జపాన్ లో రిలీజ్ కాబోతున్న పుష్ప-2

Trending News

    • పిల్ల‌ల‌ని ఈ స‌మ‌యాల్లో అస్స‌లు తిట్ట‌కూడ‌ద‌ట‌!

    • ఒలింపిక్ పతక విజేత మేరీ కోమ్‌కు ఎఫైర్ ఉందా?!

    • మకర సంక్రాంతి ఎప్పుడు! పండితులు ఏం చెబుతున్నారంటే?

    • ఐపీఎల్ 2026కు ముందు భార‌త క్రికెట‌ర్‌ రిటైర్మెంట్!

    • ప్ర‌యాణికుల కోసం రైల్వే శాఖ కీల‌క నిర్ణ‌యం..!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd