Mission Chanakya Survey Report : తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించేది ఆ పార్టీయే – మిషన్ చాణక్య పబ్లిక్ పోల్స్ సర్వే
నవంబర్ 30 న జరగబోయే ఎన్నికల్లో 44.62 శాతం ఓట్లతో మరోసారి బీఆర్ఎస్ పార్టీ (BRS Party) అధికారం చేపట్టబోతుందని తెలిపింది. ఇక కాంగ్రెస్ పార్టీ 32.71 శాతం, బీజేపీ 17.6 శాతం ఓట్లను సాధించే అవకాశం ఉందని ఈ సర్వే లెక్కలు చెప్పుకొచ్చాయి
- Author : Sudheer
Date : 22-10-2023 - 4:33 IST
Published By : Hashtagu Telugu Desk
దేశం మొత్తం చూపు తెలంగాణ ఎన్నికల (Telangana Assembly Elections 2023) పైనే ఉంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు సార్లు అధికారం చేపట్టిన బిఆర్ఎస్ (BRS)..ఈసారి విజయం సాధిస్తుందా..? లేదా అనేది ఆసక్తి రేపుతోంది. మరోపక్క రాష్ట్రంలో పలు సంస్థలు సర్వేలు పలు పార్టీల విజయాలు ఖరారు చేస్తుండడంతో ఎవరి సర్వే కరెక్ట్ అనేదానిపై మాట్లాడుకుంటున్నారు. ఇప్పటీకే కాంగ్రెస్ (Congress) గెలుస్తుందని కొన్ని సర్వేలు చెప్పగా..మరికొన్ని బిఆర్ఎస్ గెలుపు ఖాయమని చెప్పాయి.
తాజాగా మిషన్ చాణక్య పబ్లిక్ పోల్స్ సర్వే (Mission Chanakya Survey) రాష్ట్రంలో మరోసారి బిఆర్ఎస్ ఘన విజయం సాదించబోతుందని తెలిపింది. నవంబర్ 30 న జరగబోయే ఎన్నికల్లో 44.62 శాతం ఓట్లతో మరోసారి బీఆర్ఎస్ పార్టీ (BRS Party) అధికారం చేపట్టబోతుందని తెలిపింది. ఇక కాంగ్రెస్ పార్టీ 32.71 శాతం, బీజేపీ 17.6 శాతం ఓట్లను సాధించే అవకాశం ఉందని ఈ సర్వే లెక్కలు చెప్పుకొచ్చాయి. ఇక ఇతరులకు 5.07 శాతం ఓట్లు వస్తయని తమ సర్వేలో వెల్లడైందని మిషన్ చాణక్య అధినేత శివకేశవ్ తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
రాష్ట్రవ్యాప్తంగా 14 లక్షల మంది అభిప్రాయాలను సేకరించింది ఈ సంస్థ. గత నాలుగు నెలలుగా విస్తృతంగా అధ్యయనం చేసి.. డేటా సేకరించింది. పబ్లిక్ ఒపీనియన్లో బీఆర్ఎస్ కు 41. 62శాతం మంది అనుకూలంగా (మద్దతుగా) ఇచ్చారని చెప్పుకొచ్చింది. నా రాష్ట్రం.. నా ఓటు.. నా నిర్ణయం.. అనే పేరుతో మిషన్ చాణక్య సంస్థ ఈ సర్వే చేపట్టింది.
ప్రభుత్వ పథకాలు, అభివృద్ధిపై 85 శాతం మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసినట్లు ..ముఖ్యంగా బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటన తర్వాత మహిళా ఓటర్ల నుంచి ఆ పార్టీకి భారీగా సానుకూల స్పందన వచ్చిందని తెలిపింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీ కనీసం 76 స్థానాల్లో గెలుస్తుందని చెప్పుకొచ్చింది. అలాగే అన్ని వయసుల ఓటర్లలోనూ అధిక శాతం మంది బీఆర్‌ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారని తెలిపింది. మరి ఈ సర్వే ఎంత వరకు కరెక్ట్ అనేది చూడాలి.
Read Also : Encounter Fears : నన్ను, నా కొడుకును ఎన్‌కౌంటర్ చేస్తారేమో.. ఆజంఖాన్ సంచలన వ్యాఖ్యలు