HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Tdp Focus On Ghmc Elections In Telangana Groundwork Has Begun

Telangana TDP: టీడీపీలోకి తీన్మార్ మల్లన్న.. ? టార్గెట్ జీహెచ్‌ఎంసీ పోల్స్ !

'షోటైమ్' సంస్థ హైదరాబాద్‌లో ఆఫీసు పెట్టి, గ్రౌండ్ వర్క్ చేస్తోంది. హైదరాబాద్ పరిధిలో గతంలో టీడీపీ(Telangana TDP) గెల్చిన అసెంబ్లీ స్థానాల్లోని సానుభూతిపరులను షోటైమ్ ప్రతినిధులు కలుస్తున్నారు.

  • Author : Pasha Date : 04-03-2025 - 5:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telangana Tdp Ghmc Elections Ttdp Chandra Babu Ap Cm Teenmaar Mallanna

Telangana TDP: తీన్మార్ మల్లన్న ఏ పార్టీలో చేరబోతున్నారు ? అనే దానిపై చర్చ జరుగుతున్న వేళ కీలక అంశం తెరపైకి వచ్చింది. ఆయన తెలంగాణ టీడీపీలో చేరే అవకాశం ఉందనే ప్రచారం మొదలైంది. కొత్త పార్టీని ఏర్పాటు చేయడం కంటే గతంలో తెలంగాణలో ఒక ఊపు ఊపిన టీడీపీ జెండాతోనే జనంలోకి వెళ్లడం మంచిదని మల్లన్న భావిస్తున్నారట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలో తెలంగాణలోని బీసీ వర్గాలు టీడీపీని బాగా బలపరిచేవారు. అందుకే తాను తీసుకున్న బీసీ నినాదానికి, టీడీపీ జెండాకు సరితూగుతుందని మల్లన్న అనుకుంటున్నారట. చేరిక అంశంపై పలువురు టీడీపీ పెద్దలు ఇప్పటికే తీన్మార్ మల్లన్నతో చర్చలు జరిపారట. తెలంగాణ టీడీపీ పగ్గాలిస్తే తీసుకునేందుకు సిద్ధమని మల్లన్న చెప్పారట. అయితే దీనిపై టీడీపీ హైకమాండ్ ఎలా స్పందించిందో తెలియరాలేదు.

Also Read :Agent Trump : ట్రంప్‌ రష్యా గూఢచారా ? ఆయన కోడ్ నేమ్ ‘క్రస్నోవ్‌’ ?

టార్గెట్ జీహెచ్‌ఎంసీ పోల్స్

అన్నీ అనుకున్నట్టుగా జరిగితే  గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లోగా  హైదరాబాద్ పరిధిలో టీడీపీ యాక్టివ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఆంధ్రా ప్రజలు ఎక్కువగా ఉన్న హైదరాబాద్ సిటీలోని ప్రాంతాలపై టీడీపీ ఫోకస్ చేస్తుందని అంటున్నారు. తీన్మార్ మల్లన్న టీటీడీపీలో చేరితే మంచి ఫలితాలు ఖాయమనే ఆశాభావంతో చంద్రబాబు, లోకేశ్ ఉన్నారట. మరో 10 నెలల్లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం టీ టీడీపీకి పొలిటికల్ కన్సల్టెన్సీ ‘షోటైమ్’ సహాయ సహకారాలను అందించనుందట. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీడీపీ కోసం ఈ సంస్థే పనిచేసింది.

Also Read :Copy Paste Blunder: కాపీ పేస్ట్ తప్పిదం.. రూ.52వేల కోట్లు తప్పుడు బ్యాంకు ఖాతాకు !

‘షోటైమ్’ గ్రౌండ్ వర్క్

‘షోటైమ్’ సంస్థ హైదరాబాద్‌లో ఆఫీసు పెట్టి, గ్రౌండ్ వర్క్ చేస్తోంది. హైదరాబాద్ పరిధిలో గతంలో టీడీపీ(Telangana TDP) గెల్చిన అసెంబ్లీ స్థానాల్లోని సానుభూతిపరులను షోటైమ్ ప్రతినిధులు కలుస్తున్నారు. ఆసక్తి ఉన్న వారిని టీడీపీలోకి తిరిగి ఆహ్వానిస్తున్నారు. ప్రధానంగా సిటీలోని ఎల్‌బీ నగర్, మహేశ్వరం, కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్, శేరిలింగంపల్లి, ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలలోని జీహెచ్‌ఎంసీ స్థానాలపై టీడీపీ గురిపెట్టిందట. ఎన్నికలు సమీపించాక నారా లోకేశ్ రంగంలోకి దిగుతారని తెలుస్తోంది. జనసేన, బీజేపీతో కలిసి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాలని టీడీపీ భావిస్తోందట.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP CM
  • ap tdp
  • chandra babu
  • GHMC Elections
  • tdp
  • telangana
  • telangana tdp
  • Ttdp

Related News

Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో తెలంగాణ ప్రపంచ దేశాలకు కొత్త దిశానిర్దేశం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం అన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి హెచ్‌ఐసిసిలో “గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ – ది హైదరాబాద్ కలెక్టివ్”ను ప్రారంభిస్తూ, “రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతలను కూడ

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • National Status... Palampet Shiva Temple, Mulugu District

    Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం

  • Draft Of 'core Urban Region

    GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

Latest News

  • Diabetes: షుగర్ పేషెంట్స్ కు గుడ్ న్యూస్.. వారానికి ఒకేఒక్క డోస్‌తో డయాబెటిస్ కు చెక్

  • US – Iran War: ట్రంప్ హెచ్చరించిన తర్వాత, చాబహార్ ఓడరేవుపై దాడి

  • Heavy rains: వర్షం ఎఫెక్ట్‌.. రోడ్లు నదులుగా మారాయి

  • Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

  • Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd