Munugode : మునుగోడు బరిలో టీఆరెఎస్ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత..?
తెలంగాణ రాజకీయాల్లో మునుగోడు బై ఎలక్షన్ ఫీవర్ నెలకొంది. అధికార పార్టీతోపాటు విపక్షాలు ఈ ఎన్నికల ఛాలెంజింగ్గా తీసుకున్నాయి.
- By hashtagu Published Date - 03:54 PM, Mon - 5 September 22

తెలంగాణ రాజకీయాల్లో మునుగోడు బై ఎలక్షన్ ఫీవర్ నెలకొంది. అధికార పార్టీతోపాటు విపక్షాలు ఈ ఎన్నికల ఛాలెంజింగా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ తరుణ్ చుగ్ సంచలన వ్యాఖ్యలకు తెరలేపారు. మునుగోడు నుంచి టీఆరెస్ అభ్యర్థిగా కల్వకుంట్ల కవితను నిలబెడతారెమో అంటూ వ్యాఖ్యనించారు. బీజేఎల్పీ లీడర్ పై పార్టీ నేతలతో చర్చించినాక నిర్ణయం తీసుకుంటామన్నారు.
మునుగోడులో బీజేపీ భారీ మెజార్టీతో గెలుస్తుందన్నారు. టీఆరెస్ అభ్యర్థి ఎవరో ఇప్పటికి ప్రకటించలేదన్న తరుణ్ చుగ్…కవిత నా అభ్యర్థి అంటూ చురకలంటించారు. తెలంగాణలో ప్రజలు బీజేపీకి సపోర్టు చేస్తున్నారన్నారు. ఎంఐఎం కబంద హస్తాల్లో టీఆరెస్ ఉందన్నారు. అందుకే తెలంగాణ విమోచన దినోత్సవం జరిపేందుకు భయపడుతుందని అన్నారు .