Tamilisai: అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణకు నాకు ఆహ్వానం లేదు
రాజ్యాంగ నిర్మాత డా:బీఆర్ అంబేడ్కర్ భారీ విగ్రహం హైదరాబాద్ నడిబొడ్డున వెలసింది. 125 అడుగుల ఈ భారీ విగ్రహం దేశంలోనే అత్యంత ఎత్తైనది
- By Praveen Aluthuru Published Date - 09:52 AM, Sun - 16 April 23

Tamilisai: రాజ్యాంగ నిర్మాత డా:బీఆర్ అంబేడ్కర్ భారీ విగ్రహం హైదరాబాద్ నడిబొడ్డున వెలసింది. 125 అడుగుల ఈ భారీ విగ్రహం దేశంలోనే అత్యంత ఎత్తైనది. శుక్రవారం ముఖ్యమంత్రి చేతులమీదుగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి అంబేడ్కర్ మనవడు మాజీ ఎంపీ ప్రకాష్ అంబేడ్కర్ కూడా హాజరయ్యారు. అయితే ఈ బృహత్తర కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ తమిళిసై కి ఆహ్వానం అందకపోవడం కొసమెరుపు.
అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి నాకు ఆహ్వానం రాలేదన్నారు గవర్నర్ తమిళిసై. అంబేడ్కర్ మహిళల కోసం ఎంతో పోరాడారు. మహిళలకు గౌరవం ఇవ్వాలని ఆకాంక్షించారు. అలాంటిది ఒక మహిళ గవర్నర్ కు అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణకు ఆహ్వానం లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందని బాధపడ్డారు తమిళిసై. కాగా 11 ఎకరాల విస్తీర్ణంలో 50 అడుగుల ఎత్తైన పార్లమెంట్ నమూనా పీఠంపై 125 అడుగుల భారీ అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దేశంలోనే భారీ విగ్రహం ఇది. ఇప్పటికే ఈ విగ్రహం హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లోకి ఈ ఎక్కింది.