HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Taj Banjara Hotel In Hyderabad Banjara Hills Is Seized This Is The Reason

Taj Banjara Hotel: ‘తాజ్‌ బంజారా’ హోటల్‌ సీజ్.. కారణం ఇదే..

జీహెచ్‌‌ఎంసీకి తాజ్‌ బంజారా హోటల్‌‌(Taj Banjara Hotel) రూ.1.43 కోట్ల పన్ను బకాయి ఉందని అధికారులు వెల్లడించారు.

  • Author : Pasha Date : 21-02-2025 - 9:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Taj Banjara Hotel Hyderabad Banjara Hills

Taj Banjara Hotel: హైదరాబాద్‌ నగరంలోని బంజారాహిల్స్‌‌ రోడ్‌ నంబర్‌ 1లో ఉన్న తాజ్‌ బంజారా హోటల్‌‌ను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌‌ఎంసీ) అధికారులు  సీజ్ చేశారు. గత రెండేళ్లుగా పన్నులు చెల్లించకపోవడంతో ఈమేరకు చర్యలు తీసుకున్నారు. పన్నులు చెల్లించాలని పలుమార్లు నోటీసులు పంపినా,  తాజ్‌ బంజారా హోటల్‌‌ నిర్వాహకులు  స్పందించలేదు. దీంతో సీజ్ చేశారు. హోటల్‌ గేట్లకు తాళాలు వేశారు. జీహెచ్‌‌ఎంసీకి తాజ్‌ బంజారా హోటల్‌‌(Taj Banjara Hotel) రూ.1.43 కోట్ల పన్ను బకాయి ఉందని అధికారులు వెల్లడించారు. పన్ను చెల్లించాలని రెండు రోజులు గడువు ఇచ్చినా హోటల్ నిర్వాహకులు పట్టించుకోలేదన్నారు. దీంతో ఇవాళ(శుక్రవారం) ఉదయాన్నే చర్యలు చేపట్టామన్నారు.

Also Read :Peddireddy : తిరుపతి నడిబొడ్డున మాజీ మంత్రి కబ్జా ?!

ఆస్తిపన్ను బకాయిల చిట్టా.. 

  • జీహెచ్‌ఎంసీ 2024-25 ఆర్థిక సంవత్సరానికిగానూ రూ.2100 కోట్ల ఆస్తిపన్ను వసూళ్ల టార్గెట్‌ను పెట్టుకుంది.ఇప్పటివరకు రూ.1450 కోట్ల దాకా వసూలయ్యాయి.
  • ఇంకా 5 లక్షల మంది భవన యజమానుల నుంచి దాదాపు రూ.600 కోట్ల ఆస్తిపన్ను బకాయిలు రావాల్సి ఉన్నాయి.
  • ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రూ.5000 కోట్ల దాకా ఆస్తిపన్ను బకాయిలు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ కార్యాలయాల బకాయిలే రూ.3000 కోట్లు. మిగతా రూ.2000 కోట్లు సాధారణ ఆస్తిపన్ను చెల్లింపుదారుల కట్టాల్సి ఉంది.
  • జీహెచ్‌ఎంసీ ఇప్పటికే మూడు సార్లు వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ పథకాన్ని అమలు చేసింది. ఇప్పుడు మళ్లీ ఆ పథకాన్ని అమలు చేస్తే కనీసం రూ.500 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ద్వారా దాదాపు 2 లక్షల మంది బకాయిదారులకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. అయితే దీనికి ప్రభుత్వ అనుమతి లభించాల్సి ఉంది.
  • వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ పథకం అమలైతే ఆస్తిపన్ను చెల్లించాల్సిన వారు తక్కువ వడ్డీతో తమ బకాయిలను పే చేయొచ్చు. దీనివల్ల ప్రజలకు ఉపశమనం లభించడమే కాకుండా, జీహెచ్‌ఎంసీకి భారీగా ఆదాయం సమకూరుతుంది.

Also Read :Gold Price Today : మగువలకు షాక్‌.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • banjara hills
  • hyderabad
  • Taj Banjara Hotel

Related News

Do you eat fast food? Be careful—experts warn that there is a risk of developing high blood pressure.

Hyderabad: ఫాస్ట్​ఫుడ్ తింటున్నారా? జాగ్రత్త రక్తపోటు వచ్చే ఛాన్స్ ఉందంటున్న నిపుణులు

ప్యాకేజ్డ్, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల హైదరాబాద్ నగరంలోని యువతలో రక్తపోటు (బీపీ) సమస్యలు వేగంగా పెరుగుతున్నట్లు ఒక తాజా అధ్యయనంలో తేలింది. హైదరాబాద్‌కు చెందిన ‘ఐసీఎంఆర్-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్’ (ఐసీఎంఆర్-ఎన్ఐఎన్) శాస్త్రవేత్తలు ఈ పరిశోధనకు నేతృత్వం వహించారు. ఉప్పు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ప్రాసెస్డ్ ఫుడ్స్ తినే విద్యార్థుల్లో ఇతరుల కంటే బీ

  • kurchi-thatha-dies-of-heart-attack

    Kurchi Thatha: గుండెపోటుతో కుర్చీ తాత మృతి

Latest News

  • Physical Relations: శారీరక సంబంధాలపై సర్వే.. షాకింగ్ విషయాలు వెల్లడి!

  • VIJAYAWADA : బెజ‌వాడ థార్ కారు కేసు.. ఇద్దరికీ రిమాండ్

  • Vastu Tips: ఆర్థిక సమస్యలు తొలగాలంటే… ఆదివారం నాడు ఇలా చేయండి..!!

  • Chandrababu Naidu: వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

  • Peddi Movie: పెద్ది సినిమా బ్రేక్.. షాక్ ఇచ్చిన ఎగ్జిబిటర్ల

Trending News

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

    • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

    • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

    • Beer Price Drop: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్..రూ.185 బీర్ ధర రూ.110 కి..70 రూ .ల తగ్గింపు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd