Posters on Shah Visit: తడీ పార్ కౌన్ హై ? అమిత్ షా పర్యటన వేళ.. హైదరాబాద్ లో టీఆర్ఎస్ పోస్టర్ల కలకలం!!
మునుగోడు బై పోల్ నేపథ్యంలో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. టీఆర్ఎస్, బీజేపీ ఒక దానిపై మరొకటి అస్త్ర శస్త్రాలు సంధించుకుంటున్నాయి.
- By Hashtag U Published Date - 12:44 PM, Sun - 21 August 22
మునుగోడు బై పోల్ నేపథ్యంలో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. టీఆర్ఎస్, బీజేపీ ఒక దానిపై మరొకటి అస్త్ర శస్త్రాలు సంధించుకుంటున్నాయి. శనివారం రోజే మునుగోడులో భారీ బహిరంగ సభను నిర్వహించి టీఆర్ఎస్ ఉప ఎన్నికకు శంఖం పూరించింది. ఇక ఇవాళ మునుగోడు లో బీజేపీ బహిరంగ సభ ఉంది. దీనికి హాజరయ్యేందుకు మధ్యాహ్నం 2 గంటలకు అమిత్ షా హైదరాబాద్ కు చేరుకోనున్నారు. సాయంత్రం5 గంటలకు ఆయన మునుగోడు సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ సభ సందర్భంగా మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ లో చేరనున్నారు.
ఈనేపథ్యంలో బీజేపీ ని విమర్శించేందుకు ఉన్న ప్రతి అవకాశాన్ని టీఆర్ఎస్ వాడుకుంటోంది. అమిత్ షా సభకు ఒక రోజు ముందే మునుగోడు లో కేసీఆర్ మీటింగ్ జరగడమే అందుకు నిదర్శనం. తాజాగా ఇవాళ అమిత్ షా హైద్రాబాద్ కు రానున్న నేపథ్యంలో నగరంలో పలు చోట్ల “తడీ పార్ కౌన్ హై ? ” అని ప్రశ్నిస్తూ.. అమిత్ షా ను ఎద్దేవా చేసేలా.. ఆయన గతాన్ని గుర్తు చేసేలా పోస్టర్లను టీఆర్ఎస్ ఏర్పాటు చేసింది. మీరు ఈ వార్తలో చూస్తున్న పోస్టర్ బేగంపేట ఏరియా లోనిది. అమిత్ షా హైదరాబాద్ లో దిగిన తర్వాత బేగంపేట మార్గం మీదుగానే మునుగోడు కు వెళ్లారు. ఈ కారణం వల్లే ఈ రూట్ లో “తడీ పార్ కౌన్ హై ? ” పోస్టర్లను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
ఇక సోషల్ మీడియా లోనూ ఈ పోస్టర్లతో టీఆర్ఎస్ తీవ్ర ప్రచారం చేస్తోంది. “తడీ పార్ కౌన్ హై ? ” అనే ట్యాగ్ తో ఆ పోస్టులను ట్రెండ్ చేయిస్తోంది. దీనిపై నెటిజన్స్ కూడా స్పందిస్తున్నారు. గుజరాత్ అల్లర్ల కేసుకు సంబంధించి అప్పట్లో అమిత్ షా పై మీడియా లో ప్రసారమైన వార్తా వీడియోల క్లిప్పింగ్స్ ను పలువురు షేర్ చేస్తున్నారు. ” రేపటి కల్లా గుజరాత్ వదిలి వెళ్ళండి” అని అప్పట్లో సుప్రీంకోర్టు అమిత్ షా ను ఆదేశించిన వార్తలను ఇంకొందరు షేర్ చేస్తున్నారు. “తడీ పార్” అంటే.. ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఇకపై ఉండకుండా తాత్కాలిక/శాశ్వత బహిష్కరణను ఎదుర్కొనే వ్యక్తి. వివిధ కారణాలతో శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా ఈమేరకు కోర్టులు ఆదేశాలు ఇస్తుంటాయి.
#TadipaarKaunHai ❓#तड़ीपारकौनहै ❓
Hoarding in #Hyderabad#GoBackAmitShah@KTRTRS @ysathishreddy pic.twitter.com/AAG5Q1Z5sT
— Raghu Vardhan Reddy (@raghureddytrs) August 21, 2022
Related News
BJP Plan B: మ్యాజికల్ ఫిగర్ రాకపోతే బీజేపీ ప్లాన్ B ?
బీజేపీకి మెజారిటీ రాకపోతే ప్లాన్ బీ ఏమిటి ? ఈ ప్రశ్నకు అమిత్ షా స్పందిస్తూ ప్లాన్ ఎ విజయవంతమయ్యే అవకాశం 60 శాతం మాత్రమే ఉందని మీరు భావించే పరిస్థితిలో ప్లాన్ బి రూపొందించబడింది. కానీ మా పరిస్థితి అలా లేదు. ప్రధాని మోదీ అఖండ మెజారిటీతో అధికారంలోకి రావడం ఖాయమన్నారు.