Social Media Fake Posts : ఇక పై ఫేక్ పోస్టులు పెడితే జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందే !
Social Media Fake Posts : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ (T Congress)అధికారిక ట్విట్టర్ ద్వారా చేసిన ప్రకటనలో, సోషల్ మీడియాలో బూతు వ్యాఖ్యలు, ఫేక్ న్యూస్ పోస్టులపై పోలీసులు పకడ్బందీగా నిఘా పెడుతున్నారని పేర్కొంది
- By Sudheer Published Date - 11:12 AM, Mon - 14 April 25

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt) సోషల్ మీడియాలో అసభ్యకర, నకిలీ పోస్టుల(Social Media Fake Posts)పై కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమైంది. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ (T కాంగ్రెస్ )అధికారిక ట్విట్టర్ ద్వారా చేసిన ప్రకటనలో, సోషల్ మీడియాలో బూతు వ్యాఖ్యలు, ఫేక్ న్యూస్ పోస్టులపై పోలీసులు పకడ్బందీగా నిఘా పెడుతున్నారని పేర్కొంది. ఇకపై ఈ రకమైన చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనేవారికి కఠిన శిక్షలు తప్పవని, జైలు శిక్ష కూడా విధించవచ్చని స్పష్టం చేసింది.
Dark Chocolate: భోజనం తర్వాత డార్క్ చాక్లెట్ తింటున్నారా?
సామాజిక మాధ్యమాల్లో తప్పుదారి పట్టించే సమాచారం, అసత్య వార్తలు, ఇతరుల పరువు నష్టం కలిగించే పోస్టులు ఎక్కువవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. ఈ విధానంతో సోషల్ మీడియా వేదికలను మరింత బాధ్యతాయుతంగా, జాగ్రత్తగా వాడే అవకాశం ఉంది. ప్రజల మధ్య అసహనం, అశాంతిని రెచ్చగొట్టే ప్రకటనలపై అధికారులు నిఘా పెట్టి తగిన చర్యలు తీసుకుంటున్నారని అధికారులు తెలిపారు.
ఇటీవల HCU (హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ) గురించి సోషల్ మీడియాలో పెట్టిన 50కి పైగా ఫేక్ పోస్టులను తొలగించినట్లు సమాచారం. ఇది ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే జరిగిందని తెలుస్తోంది. ఇకపై సోషల్ మీడియాను దుర్వినియోగం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ వర్గాలు హెచ్చరించాయి. ప్రజలందరూ సోషల్ మీడియాలో బాధ్యతాయుతంగా ప్రవర్తించాలనీ, నకిలీ సమాచారాన్ని వ్యాప్తి చేయకూడదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇక సోషల్ మీడియా CLEAN. pic.twitter.com/BirTRKJ2wy
— Telangana Congress (@INCTelangana) April 13, 2025