Mahesh sister : శిల్పాచౌదరిపై హీరో సుధీర్ బాబు భార్య పోలీసులకు ఫిర్యాదు!
సుధీర్ బాబు భార్య, మహేష్ బాబు సోదరి ప్రియదర్శని స్నేహితురాలు అయిన శిల్పా చౌదరిపై ఫిర్యాదు చేశారు. శిల్పా 3.90 కోట్ల మేర మోసం చేశారని ప్రియదర్శిని తన ఫిర్యాదులో పేర్కొంది.
- By Balu J Published Date - 01:51 PM, Fri - 3 December 21

సుధీర్ బాబు భార్య, మహేష్ బాబు సోదరి ప్రియదర్శిని స్నేహితురాలు అయిన శిల్పా చౌదరిపై ఫిర్యాదు చేశారు. శిల్పా 3.90 కోట్ల మేర మోసం చేశారని ప్రియదర్శిని తన ఫిర్యాదులో పేర్కొంది. శిల్పా ప్రియదర్శిని రియల్ ఎస్టేట్‌లో భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టింది. సుధీర్ బాబు భార్య ప్రియదర్శిని కొన్నాళ్లుగా మీడియాకు దూరంగా ఉంటున్నారు. తాజాగా.. శిల్పా చౌదరిపై ప్రియదర్శిని ఫిర్యాదు చేయగా, ఆమెను శనివారం నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. శిల్పా చౌదరి కిట్టీ పార్టీల పేరుతో చాలా మంది ఎ-లిస్ట్ సెలబ్రిటీలను మోసం చేసింది. అయితే ప్రియదర్శిని విషయంలో రియల్ ఎస్టేట్ లో రూ.3.90 కోట్లు పెట్టుబడి పెట్టాలని ప్రియదర్శినిని శిల్ప కోరింది. శిల్పాను అరెస్టు చేసిన తర్వాత, ఆమె, ఆమె భర్త శ్రీనివాస్ ప్రసాద్ నిర్వహిస్తున్న బ్యాంకు ఖాతాలను పోలీసులు గుర్తించారు.
ACP రఘునందన్ రావు మాట్లాడుతూ, “అన్ని ఖాతాలు హైదరాబాద్ కేంద్రంగా రన్ అవుతున్నాయి. వాటిని స్తంభింపజేయడానికి సంబంధిత బ్యాంకులకు లేఖలు పంపాము.” అని అన్నారు. సెహరి సినిమాతో నిర్మాతగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది శిల్పా చౌదరి. కొన్నేళ్లుగా ఆమెకు తెలుగు చిత్ర పరిశ్రమలో పరిచయాలు ఏర్పడ్డాయి. ఇండస్ట్రీకి చెందిన చాలా మంది ఆమె బారిన పడ్డారని సమాచారం. చీటింగ్ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.