TTD: తిరుమల ప్రయాణికులకు గుడ్ న్యూస్.. దక్షిణమధ్య రైల్వే కీలక నిర్ణయం.. అందుబాటులోకి ప్రత్యేక రైళ్లు
తిరుమల వెళ్లే భక్తులకోసం దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. చర్లపల్లి నుంచి తిరుపతికి మధ్య 16 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.
- By News Desk Published Date - 08:20 PM, Tue - 29 April 25

TTD: శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు ప్రతీరోజూ వేలాది మంది భక్తులు తిరుమలకు తరలివెళ్తుంటారు. ప్రస్తుతం వేసవి సెలవులు రావడంతో తిరుమల వెళ్లే యాత్రికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో తిరుమల వెళ్లే భక్తులకోసం దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. చర్లపల్లి నుంచి తిరుపతికి మధ్య 16 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. అదేవిధంగా.. వేసవి సెలవుల రద్దీ నేపథ్యంలో కాచిగూడ – నాగర్ కోయిల్ మధ్య ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే పొడిగించింది. జూన్ 8వ తేదీ వరకు ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి.
Also Read: King And Queen: రాజు పైలట్.. రాణి కోపైలట్.. విమానంలో సాహస యాత్ర
ప్రత్యేక రైళ్ల వివరాలు ఇలా..
♦ మే 7వ తేదీ నుంచి జూన్ 25వ తేదీ వరకు చర్లపల్లి నుంచి ఎనిమిది ప్రత్యేక రైళ్లు నడుస్తాయి.
♦ ప్రతిరోజూ సాయంత్రం 6.50 గంటలకు ప్రత్యేక రైలు చర్లపల్లిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.55 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.
♦ మే 8వ తేదీ నుంచి ప్రతిరోజూ సాయంత్రం 4.55 గంటలకు ప్రత్యేక రైలు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.
♦ ఈ రైళ్లు జనగామ, కాజీపేట, వరంగల్, నెక్కొండ, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి.
♦ 1 ఏసీ, 2ఏసీ, 3ఏసీ, స్లీపర్, జనరల్ కోచ్‌లు అందుబా టులో ఉండనున్నాయి.
♦ వేసవి సెలవుల రద్దీని దృష్టిలో పెట్టుకుని కాచిగూడ – నాగర్ కోయిల్ మధ్య ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే పొడిగించింది.
♦ వచ్చే నెల 9 నుంచి జూన్ 6వ వరకు కాచిగూడ నుంచి నాగర్ కోయిల్ కు ఐదు ప్రత్యేక రైళ్లు నడుస్తాయి.
♦ ప్రతి శుక్రవారం ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుంది.
♦ నాగర్ కోయిల్ నుంచి కాచిగూడకు మే11 నుంచి జూన్ 8వ తేదీ వరకు ఐదు ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి.
16 Special Trains between Charlapalli and Tirupati pic.twitter.com/PvpeNQEBxd
— South Central Railway (@SCRailwayIndia) April 28, 2025
♦ మరోవైపు వేసవి రద్దీ నేపథ్యంలో చర్లపల్లి నుంచి కాకినాడ టౌన్ వరకు, చర్లపల్లి నుంచి నర్సాపూర్ వరకు 36 స్పెషల్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే పొడిగించింది.
♦ మే 2వ తేదీ నుంచి జూన్ 27వ తేదీ వరకు చర్లపల్లి నుంచి కాకినాడ టౌన్ వరకు కాకినాడ టౌన్ నుంచి చర్లపల్లి వరకు 18 ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి.
♦ మే2వ తేదీన సాయంత్రం 7.20గంటలకు చర్లపల్లిలో ప్రత్యేక రైలు బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 4.30 గంటలకు కాకినాడ టౌన్ కు చేరుకుంటుంది.
♦ మే 4వ తేదీ సాయంత్రం 6.55 గంటలకు కాకినాడ టౌన్ లో ప్రత్యేక రైలు బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 6.50 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది.
♦ చర్లపల్లి నుంచి నర్సాపూర్ వరకు నర్సాపూర్ నుంచి చర్లపల్లి వరకు 18 ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. మే2వ తేదీన సాయంత్రం 7.15గంటలకు చర్లపల్లిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.50 గంటలకు నర్సాపూర్ కు రైలు చేరుకుంటుంది.
♦ మే4వ తేదీన రాత్రి 8గంటలకు నర్సాపూర్ లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8గంటలకు చర్లపల్లికి ప్రత్యేక రైలు చేరుకుంటుంది.
36 Special Trains Extended between Charlapalli – Kakinada Town & Charlapalli – Narsapur pic.twitter.com/uHhokHyeQ2
— South Central Railway (@SCRailwayIndia) April 28, 2025