Trains Cancellation: తెలుగు రాష్ట్రాల్లో 25వ తేదీ వరకు 28 రైళ్లు రద్దు.. ఎంఎంటీఎస్ రైళ్లు కూడా.. ఆ రైళ్ల వివరాలు ఇవే..
తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర ప్రాంతాల్లోని పలు రూట్లలో వెళ్లాల్సిన 28 రైళ్లు రద్దయ్యాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మరో ఆరు రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. 23ఎంఎంటీఎస్ రైళ్లు కూడా ఈనెల 25 వరకు రద్దయ్యాయి.
- By News Desk Published Date - 07:56 PM, Mon - 19 June 23

తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర ప్రాంతాల్లోని పలు రూట్లలో వెళ్లాల్సిన 28 రైళ్లు రద్దయ్యాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ట్విటర్ వేదికగా ఇందుకు సంబంధించిన వివరాలను రైల్వే శాఖ వెల్లడించింది. ఈ నెల 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు అంటే వారం రోజుల పాటు రైళ్లు పూర్తిగా నిలిచిపోనున్నాయి. ఈ విషయంపై సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ స్పందిస్తూ.. 25వ తేదీ వరకు పలు ప్రాంతాల్లో ప్రయాణం సాగించే 28 రైళ్లు రద్దు చేస్తున్నామని, మరో ఆరు రైళ్లను కూడా పాక్షికంగా రద్దు చేసినట్లు తెలిపారు.
రైల్వే ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి ఈ వారంరోజుల పాటు ప్రత్యామ్నాయ మార్గాల్లో తమ రాకపోకలు సాగించాలని కోరారు. రైల్వే ట్రాక్ మరమ్మతులు, ఇతర కారణాల వల్ల ఈ రైళ్లు వారంరోజులు పాటు రద్దు చేశారు. మరోవైపు హైదరాబాద్ వాసులు, ఉద్యోగస్తులు ఎక్కువగా ఎంఎంటీఎస్ రైళ్లలో రాకపోకలు సాగిస్తుంటారు. వీటిలో 23 రైళ్లనుకూడా ఈనెల 25 వరకు రద్దు చేయడం జరిగిందని రైల్వే అధికారులు తెలిపారు.
Cancellation / Partial Cancellation / Rescheduling of Train @drmhyb @drmsecunderabad pic.twitter.com/KXdebBaGpq
— South Central Railway (@SCRailwayIndia) June 18, 2023
Cancellation of MMTS Trains @drmhyb @drmsecunderabad pic.twitter.com/IfEY8BJtps
— South Central Railway (@SCRailwayIndia) June 18, 2023