Somesh Kumar: సోమేష్ ఈజ్ బ్యాక్, కేసీఆర్ ముఖ్య సలహాదారుగా నియామకం!
కేసీఆర్ (CM KCR) ముఖ్య సలహాదారుగా సోమేష్ కుమార్ (Somesh Kumar) నియమితులయ్యారు.
- Author : Balu J
Date : 09-05-2023 - 9:19 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) ముఖ్య సలహాదారుగా రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ (Somesh Kumar) నియమితులయ్యారు. ఈ నియామకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో సోమేష్ కుమార్ మూడేళ్లు కొనసాగుతారు. ఆయనకు కేబినెట్ హోదా కల్పించారు. సోమేష్ కుమార్ 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి.
ఉమ్మడి ఏపీలో (Andhra Pradesh) పలు కీలక పదవుల్లో పనిచేశారు. రాష్ట్ర విభజన సమయంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ గా ఉన్న ఆయన, తెలంగాణ ఏర్పాటు తర్వాత గిరిజన సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శిగా, ఆబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. 2019 డిసెంబర్ 31న తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా (CS) నియమితులయ్యారు.
Also Read: Gurukula Students: ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన గురుకుల బీసీ విద్యార్థులు!