HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Gurukula Students Get Best Ranks In Inter Results

Gurukula Students: ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన గురుకుల బీసీ విద్యార్థులు!

ఇంటర్ ఫలితాల్లో బిసీ గురుకుల విద్యార్థులు అత్యధిక ర్యాంకులు సాధించి తమ సత్తాను చాటారు.

  • Author : Balu J Date : 09-05-2023 - 9:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Inter
Inter

ఈఏడాది 2022-23 ఇంటర్ ఫలితాల్లో (Inter Results) మహాత్మా జ్యోతిభా పూలే బిసీ గురుకుల విద్యార్థులు (Gurukula Students) అత్యధిక ర్యాంకులు సాధించి తమ సత్తాను చాటారు. వందల సంఖ్యలో విద్యార్థులు పదిలోపు ర్యాంకులు సాధించి ఫలితాల్లో ప్రభంజనం కొనసాగిస్తున్నారు. సీఎం కేసీఆర్ సకల సౌకర్యాలతో ఉన్నత స్థాయి నాణ్యతా ప్రమాణాలతో బీసీ బిడ్డలకు అందించిన విద్య ఫలితమే ఈ రిజల్ట్స్ అన్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్. మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థులను, బీసీ గురుకుల సిబ్బందిని అభినందించారు.

నేడు వెలువడిన పలితాలలో సీనియర్ ఇంటర్ లో 44మంది విద్యార్థులు పదిలోపు ర్యాంకులు (Ranks) సాధించగా ఆరు కాలేజీలు వంద శాతం ఉత్తీర్ణతతో సహా సీనియర్ ఇంటర్ లో 86.67ఉత్తీర్ణతా శాతం సాధించారు. జూనియర్ ఇంటర్ లో 301 మంది విద్యార్థులు పదిలోపు ర్యాంకులు సాధించగా మూడు కాలేజీలు వందశాతం ఉత్తీర్ణతా సాధించాయి. జూనియర్ ఇంటర్ లో 78.78 ఉత్తీర్ణత శాతం సాధించారు. ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షకు 8527 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, 8516మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వారిలో 7381 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా ఏ గ్రేడ్ సాధించిన వారు 5812, బి గ్రేడ్ సాధించిన వారు 1225, సి గ్రేడ్ సాధించిన విద్యార్థులు 301 కాగా 43మంది విద్యార్థులు డి గ్రేడ్ పొందారు. ఇక ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు 8434 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా వారిలో 8425 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 6637మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా వారిలో ఏ గ్రేడ్ సాధించిన విద్యార్థులు 4135, బి గ్రేడ్ సాధించిన విద్యార్థులు 1695, సి గ్రేడ్ సాధించిన విద్యార్థులు 604 కాగా 203మంది విద్యార్థులు డి గ్రేడ్ పొందారు.

సీనియర్ ఇంటర్ లో ర్యాంకులు

ఎంపీసీ లో (MPC) 4వ ర్యాంక్ శ్రీజ, ఖానాపూర్, 991 మార్కులు, 5వ ర్యాంక్ కె. మహేశ్, చిట్యాల, 990 మార్కులు సాధించగా మరో 33మంది విద్యార్థులు పది లోపు ర్యాంకులు సాధించారు. బైపీసీలో సంగారెడ్డి కాలేజీ విద్యార్థులు 6వ ర్యాంక్ పల్లవి, 989 మార్కులు, 7వ ర్యాంకు నందిని, 988 మార్కులు, సాధించారు. మరో 9మంది విద్యార్థులు పది లోపు ర్యాంకులు సాధించారు. ఎంఈసి లో అనిత, కల్వకుర్తి, 981 మార్కులతో 8వ ర్యాంక్ సాధించింది. సిఇసి లో దీక్షిత, ఖానాపూర్, 977 మార్కులతో 8వ ర్యాంక్, అభి సాత్విక, రామగుండం, 976 మార్కులతో 9వ ర్యాంకు సాధించారు.

జూనియర్ ఇంటర్ లో ర్యాంకులు

ఎంపీసీలో 1 వ ర్యాంకు హరిత, మందమర్రి, 468 మార్కులు , రెండవ ర్యాంకు 467 మార్కులతో భూమిక, సికింద్రాబాద్, కీర్తి, చందుపట్ల ఇద్దరు విద్యార్థులు సాధించారు. వీరిలో పాటు 230మంది పది లోపు ర్యాంకులు సాధించారు. బైపీసీలో 4 వ ర్యాంక్ రిషిత, వరంగల్,435 మార్కులు , 5వ ర్యాంక్ 434 మార్కులతో పది మంది విద్యార్థులు, మొత్తం 55మంది విద్యార్థులు పది లోపు (Top Ranks) ర్యాంకు సాధించారు. ఎంఈసీలో 492 మార్కులతో 4వ ర్యాంక్ స్వప్న, సంగారెడ్డి, మధులత, జగ్దేవ్ పూర్ , సాధించగా పది మంది విద్యార్థులు పది లోపు ర్యాంకులు సాధించారు. హెచ్ ఈసీలో ఫస్ట్ ర్యాంక్ నాగరాణి, ఎల్ ఎం డి కాలనీ, 489 మార్కులు, 2వ ర్యాంకు నాగ త్రిష, లంకపల్లి, 488 మార్కులు సాధించారు. సీఈసీలో 5వ ర్యాంక్ ప్రవల్లిక, జగ్దేవ్ పూర్ , 488 మార్కులు సాధించగా మరో ఏడుమంది విద్యార్థులు పదిలోపు ర్యాంకులు సాధించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Gurukula Students
  • telangana
  • TS Inter Results 2023

Related News

Amit Shah makes key remarks on alliances in Telangana.

Amit Shah: తెలంగాణలో పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో బీజేపీ పార్టీ పొత్తులకు సంబంధించి కేంద్రమంత్రి అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఏ ప్రాంతీయ పార్టీతోనూ పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. ఒంటరిగానే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ హైకమాండ్ దృష్టి పెట్టినట్లు స్పష్టం చేశారు. ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో పొత్తులు పెట్టుకోవడం వల్ల బ

  • Heavy Rain Forecast for Telangana

    తెలంగాణను తాకిన నైరుతి రుతుపవనాలు

Latest News

  • Amaravati: అమరావతికి కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు

  • Low BP: లో బీపీ ఉందా.. ఇలా చేస్తే దాని ముప్పు నుంచి బయటపడొచ్చు!!

  • TMC: మమతకు షాక్.. టీఎంసీకి మరో రాజ్యసభ ఎంపీ రాజీనామా

  • Alia Bhatt: ఆలియా భట్ యాక్షన్ విధ్వంసం.. ఆల్ఫా టీజర్ రిలీజ్

  • Bharathiraja: ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో భారతీరాజా అంత్యక్రియలు

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd