Skill University : ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ప్రాంగణంలోనే ‘స్కిల్ యూనివర్సిటీ’ : సీఎం రేవంత్
రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
- By Pasha Published Date - 05:06 PM, Mon - 8 July 24

Skill University : రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ నెలాఖరున జరిగే అసెంబ్లీ సమావేశాలకు రెండు రోజుల ముందే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన స్పష్టమైన ప్రతిపాదనలతో రావాలని అధికారులకు నిర్దేశించారు. ఆ ప్రతిపాదనలను పరిశీలించి ఇరవై నాలుగు గంటల్లోగా ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని రేవంత్ ప్రకటించారు.వివిధ రంగాల పారిశ్రామిక ప్రముఖులతో ముఖ్యమంత్రి గురువారం మధ్యాహ్నం గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో సమావేశమయ్యారు. ఈసందర్భంగా స్కిల్ యూనివర్సిటీ(Skill University) ఏర్పాటుపై వారితో చర్చించారు.
We’re now on WhatsApp. Click to Join
ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుపై అధికారులతో పాటు ప్రముఖుల అభిప్రాయాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ప్రాంగణంలోనే స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఐఎస్బీ తరహాలో ఒక బోర్డును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుందనే టాపిక్‌పై చర్చ జరిగింది. స్కిల్ యూనివర్సిటీ కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసే వరకు ఈ సమావేశానికి హాజరైన ప్రతినిధులందరినీ తాత్కాలిక బోర్డుగా పరిగణించాలని అధికారులకు సీఎం సూచించారు.
Also Read :Menstrual Leave : ‘నెలసరి సెలవుల’ పిటిషన్ కొట్టివేసిన ‘సుప్రీం’.. కీలక వ్యాఖ్యలు
స్కిల్ యూనివర్సిటీలో ఏమేం కోర్సులుండాలి ? ఎలాంటి కరికులం ఉండాలి ? పరిశ్రమల అవసరాలు ఏమిటి ? అనేది తెలుసుకొని, వాటికి అనుగుణంగా యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చేలా కోర్సులను తయారు చేయాలని సీఎం సూచించారు. దీనికి ఏర్పాటుకు సంబంధించిన ఆర్థికపరమైన అంశాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో.. కరిక్యులమ్, కోర్సులకు సంబంధించి అంశాలను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో చర్చించాలని అధికారులను కోరారు. నిర్ణీత గడువు పెట్టుకొని ప్రతిపాదనలు రూపొందించాలని, కేవలం 15 రోజుల వ్యవధి ఉన్నందున ప్రతీ అయిదు రోజులకోసారి సమావేశం కావాలని సీఎం(CM Revanth Reddy) వారికి దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలా.. ప్రభుత్వమే ఈ బాధ్యతలను చేపట్టాలా అనేది కూడా పరిశీలించాలన్నారు. యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు, ప్రాజెక్టు రిపోర్టులన్నీ తయారు చేసేందుకు ఒక కన్సల్టెంట్ ను నియమించుకోవాలని సీఎం చెప్పారు. స్కిల్ యూనివర్సిటీ వ్యవహారాలకు పరిశ్రమల శాఖ నోడల్ డిపార్టుమెంటుగా ఉంటుందన్నారు. ఈ సమావేశానికి ముందు ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో నిర్మిస్తున్న కన్వెన్షన్ సెంటర్ ను ముఖ్యమంత్రి పరిశీలించారు.