TSPSC: టీఎస్పీఎస్సి పేపర్ లీక్ లో నిందితుల ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తున్న సిట్?
ఇటీవలె టీఎస్పీఎస్సి ప్రశ్న పత్రం లీక్ అయిన విషయం తెలిసిందే. ఇందులో బాగానే కొందరు నిందితులను అరెస్టు
- By Nakshatra Published Date - 04:50 PM, Sun - 19 March 23

ఇటీవలె టీఎస్పీఎస్సి ప్రశ్న పత్రం లీక్ అయిన విషయం తెలిసిందే. ఇందులో బాగానే కొందరు నిందితులను అరెస్టు చేశారు. కాగా టీఎస్పీఎస్సి ప్రశ్నపత్రం లీక్ కేసులో నిందితుల ఆర్థిక లావాదేవీలపై సిట్ బృందం ఆరా తీస్తోంది. ఈ కేసులో నిందితులను సిట్ కట్టడికి కోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసింది. ఈనెల 18 నుంచి అనగా నిన్నటి నిందితులను సిట్ బృందం ప్రశ్నిస్తోంది. నేడు రెండవ రోజు కూడా సిట్ అధికారులు నిందితులను విచారిస్తున్నారు. దాంతో పాటుగా సిట్ టీం 2022 అక్టోబర్ నెల నుంచి జరిగిన ఏడు పరీక్షలపై కూడా ఫోకస్ పెట్టింది.
ఏడు పరీక్షల్లో అత్యధిక మార్కులు వచ్చిన అభ్యర్థులపై సిట్ నజర్ పెట్టింది. అంతేకాకుండా ఈ ఏడు పరీక్షల కోసం సంబంధించిన ప్రశ్న పత్రాలు ఏమైనా లీక్ అయ్యాయా అన్న కోణంలో కూడా అధికారులు చేస్తున్నారు. కాగా ఈనెల 5వ తేదీ జరిగిన ఏఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నతో పాటుగా మరో నాలుగు ప్రశ్న పత్రాలను కూడా ప్రవీణ పెన్ డ్రైవ్ లో డౌన్లోడ్ చేసుకున్నారని సిట్ టీం గుర్తించినట్టు తెలుస్తోంది. పేపర్ లీక్ కేసులో ప్రవీణ్, రాజశేఖర్ కీలకంగా వ్యవహరించినట్టుగా కూడా సిట్ టీం గుర్తించింది.
కాగా టీఎస్పీఎస్సి పేపర్ లీక్ కేసులో భాగంగా ఇప్పటికే 9 మందిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసింది. ఉమ్మడి మహబూబ్ నగర్ కు చెందిన రేణుక కొందరికి ఈ పేపర్ ను విక్రయించినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. పేపర్ లీక్ కేసులో లావాదేవీల విషయంలో చోటు చేసుకున్న విభేదాలు కారణంగానే ఈ విషయం విలుగులోకి వచ్చింది పోలీసులు వెల్లడించారు.

Related News

BRS Twist : వారెవ్వా! కేసీఆర్ పాలి`ట్రిక్స్` మైండ్ బ్లోయింగ్!
సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ ను మరచిపోయేలా తెలంగాణ పబ్లిక్ సర్వీస్