Sand : తెలంగాణలో ఇసు’క’ష్టాలు
Sand : ప్రజలకు మంచి చేయడం కోసమే అని ప్రభుత్వం చెపుతున్న..మంచి కంటే ఎక్కువ చెడునే జరుగుతుంది
- By Sudheer Published Date - 11:06 AM, Mon - 24 February 25

తెలంగాణ లో ఎన్నడూ లేని విధంగా ఇసుక కష్టాలు (Sand Troubles) కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ప్రజలకు మంచి చేయడం కోసమే అని ప్రభుత్వం చెపుతున్న..మంచి కంటే ఎక్కువ చెడునే జరుగుతుంది. ప్రభుత్వం చేపట్టిన ఏ పథకాలు , తీసుకుంటున్న ఏ నిర్ణయాలు కూడా ప్రజలకు ఏమాత్రం మేలు చేయడం లేదు. సీఎం రేవంత్ (CM Revanth) ఏమనుకొని ..ఏంచేద్దామని నిర్ణయాలు తీసుకుంటున్నారో..? ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తున్నారో..? కానీ వేటికి క్లారిటీ అనేది ఉండడం లేదు.
SLBC Incident : టన్నెల్‌లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ర్యాట్ హోల్ మైనింగ్ విధానం
గత 20 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక కష్టాలు నడుస్తున్నాయి. ముఖ్యంగా సామాన్య , మధ్యతరగతి ప్రజలకు ఇసుక కష్టాలు నిద్ర కూడా పోనివ్వడం లేదు. అక్రమ ఇసుకను అరికట్టడమే లక్ష్యమని చెప్పి ప్రభుత్వం ఎక్కడిక్కడే ఇసుక యార్డ్ లను , ఇసుక రవాణాను ఆపేసింది. దీంతో ఇల్లు కట్టుకోవాలని భావించిన వారికీ నిరాశే ఎదురైంది. కొంతమంది ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టి..ఇసుక రవాణా ఆగిపోవడంతో నిర్మాణాలు ఆగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క అన్ని పర్మిషన్ లు ఉన్నప్పటికీ తమ ట్రాక్టార్లను పట్టుకొని సీజ్ చేస్తున్నారని ఇసుక రవాణా యజమానులు అంటున్నారు. 20 రోజులుగా ఇసుక బంద్ కావడంతో ఎక్కడిక్కడే నిర్మాణాలు ఆగిపోవడంతో తాపీ మేస్త్రీలు , కూలీలు పనులు లేక , చేతిలో డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల లారీల ద్వారా ఇసుక రవాణా చేస్తున్నప్పటికీ టన్ను దాదాపు రూ.1500 వసూళ్లు చేస్తున్నారు. నెల క్రితం వరకు రూ.900 ఉండగా, ఇప్పుడు అమాంతం పెంచేసరికి అపార్టుమెట్స్ నిర్మించే బిల్డర్లు సైతం లబోదిబోమంటున్నారు.
Shashi Tharoor: శశి థరూర్ ఏం చేయబోతున్నారు ? ఆయన ఫ్యూచర్ ప్లాన్ ఏమిటి ?
అసలు ఇసుక ట్రాక్టర్లను ఎందుకు అడ్డుకుంటున్నారో క్లారిటీ ఇవ్వడం లేదు. మరోపక్క ఇదే అదును చేసుకొని పోలీసులు సైతం జేబులు నింపుకుంటున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక కష్టాలు నడుస్తుండడంతో ప్రజలు ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేనా మీరు తెచ్చిన మార్పు..? ఇదేనా మీము కోరుకున్నది..? అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఇసుక కష్టాల నుండి గట్టెకించాలని కోరుతున్నారు.