HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Same Scene Today Otuku Notu Reminds Telangana Politics

Farmhouse Politics: నాడు, నేడు సేమ్ సీన్.. ‘ఓటుకు నోటు’ గుర్తుకువస్తోంది!

మొయినాబాద్ శివార్లలోని అజీజ్ నగర్ ఫాంహౌస్ లో జరిగిన ఎమ్మెల్యేల బేరాలు సంచలనం సృష్టిస్తోంది. జరిగిన ఘటన, పోలీసుల మెరుపు

  • Author : Balu J Date : 27-10-2022 - 11:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Politics
Politics

మునుగోడు ఉప ఎన్నిక ముంగిట తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టిన ఘటన రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. ఈ ఘటన నాటి ఓటుకు నోటును గుర్తుకుతెస్తోంది. మొయినాబాద్ శివార్లలోని అజీజ్ నగర్ ఫాంహౌస్ పోలీసుల మెరుపు దాడి, వ్యక్తులు పట్టుబడిన విధానం చూస్తుంటే అచ్చంగా కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ఓటుకు నోటు వ్యవహారం గుర్తుకొస్తోంది కదూ. అప్పుడు జరిగింది ఇప్పుడు జరిగింది దాదాపు సేమ్ టు సేమ్ సీన్. అదేదో సినిమాలో కోట శ్రీనివాసరావు చెప్పినట్లు సేమ్ టు సేమ్. వ్యక్తులు మారారు, తేదీలు మారాయి, పాత్రదారులు మారారంతే. గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధనరెడ్డి, రేగా కాంతారావు, రోహిత్ రెడ్డితో బేరసారాలు జరుగుతున్న సమయంలో పోలీసులు ఫాంహౌస్ పై దాడిచేసి బేరాలాడుతున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు ప్రకటించారు. పార్టీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మీడియాతో మాట్లాడుతూ ఒక్కో ఎమ్మెల్యేకి బీజేపీ రూ.100 కోట్లు, కాంట్రాక్టులు, పదవులు ఆఫర్ చేసినట్లు ఆరోపించారు. పోలీసుల దాడి తర్వాత ఎమ్మెల్యేలు ఫాంహౌస్ నుండి వెళ్ళిపోయారు.

బాలరాజు మీడియాతో మాట్లాడుతూ జరిగిన ఘటనకు తమకు ఎలాంటి సంబంధంలేదన్నారు. ఒక ఫ్రెండ్ పిలిస్తేనే ఫాంహౌస్ కు వచ్చినట్లు చెప్పారు. సరే పోలీసులు కేసు నమోదుచేసి అరెస్టు చేశారు కాబట్టి దర్యాప్తులో అన్నీ విషయాలు తెలుస్తాయి. అచ్చంగా 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే బయటపడిన ఓటుకు నోటు ఘటన గుర్తుకొస్తోంది. అప్పట్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ఓటు కొనేందుకు చంద్రబాబు నాయుడు రు. 5 కోట్లకు బేరం కుదుర్చుకున్నారనే ఆరోపణలు అందరికీ తెలిసిందే. బేరంలో భాగంగా అడ్వాన్స్ రూ. 50 లక్షలు ఇచ్చేందుకు అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి స్టీఫెన్ ఇంటికి వెళ్ళి పట్టుబడ్డారు. అప్పట్లో కూడా స్టీఫెన్ ఏసీబీ పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకే దాడిచేసి రెడ్ హ్యాండెడ్ గా రేవంత్ ను డబ్బు సంచుల‌తో పట్టుకున్నారు.

ఇప్పుడు టేబుల్ మీద డబ్బు కనబడలేదు కానీ బేరాలు జరిగినట్లు ఆరోపణలు వినబడుతున్నాయి. అంటే అప్పుడైనా, ఇప్పుడైనా జరిగింది ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలే. అప్పట్లో బేరంచేసింది టీడీపీ అయితే.. ఇప్పుడు బీజేపీ. అప్పుడు నామినేటెడ్ ఎమ్మెల్యే అయితే ఇప్పుడు నలుగురు ఎలక్టెడ్ ఎమ్మెల్యేలు. అప్పుడు దాడిచేసి పట్టుకుంది ఏసీబీ పోలీసులు అయితే.. ఇప్పుడు రెగ్యులర్ పోలీసులు. అప్పుడు పట్టుబడింది టీడీపీ ఎమ్మెల్యేలు అయితే.. ఇప్పుడు పట్టుబడింది స్వామీజీలు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్య‌వ‌హారానికి సంబంధించి సోష‌ల్ మీడియాలో మీమ్స్ తెగ‌చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. నాటి ఓటుకు నోటు సంఘ‌ట‌న‌ను.. నేటి ఎమ్మెల్యేల కొనుగోలు విఫ‌ల‌య‌త్న ఘ‌ట‌న‌ను పోల్చుతూ ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్య‌మాల్లో పోస్టులు పెడుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • farm house
  • political crisis
  • telangana
  • TRS MLAs

Related News

Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో తెలంగాణ ప్రపంచ దేశాలకు కొత్త దిశానిర్దేశం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం అన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి హెచ్‌ఐసిసిలో “గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ – ది హైదరాబాద్ కలెక్టివ్”ను ప్రారంభిస్తూ, “రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతలను కూడ

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • National Status... Palampet Shiva Temple, Mulugu District

    Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం

  • Draft Of 'core Urban Region

    GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

Latest News

  • Diamond Lotus: అంతరిక్షంలోకి ల్యాబ్‌-గ్రోన్‌ వజ్ర కమలం చరిత్ర సృష్టించనుంది..!

  • Lenin Review: అఖిల్ అక్కినేని లెనిన్ సినిమా రివ్యూ

  • Medicines Prices: సామాన్యుడికి భారీ ఉపశమనం.. 39 మందుల ధరలను నిర్ణయించిన ప్రభుత్వం

  • Kadapa: బ్రహ్మణి స్టీల్స్ భూములు పై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం

  • H-1B: హెచ్-1 బీ, గ్రీన్ కార్డ్ అభ్యర్థులకు అలర్ట్.. ఇకపై కొత్త రూల్స్..!

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd