Sama Ram Mohan Reddy : సిగ్గుందా సైకో రామ్..? – సామ రామ్మోహన్ కీలక వ్యాఖ్యలు
Sama Ram Mohan Reddy : "సిగ్గుందా సైకో రామ్? కుటుంబ పాలన గురించి మాట్లాడే ముందు మీ ఇంట్లో అద్దం ముందు నిలబడి మాట్లాడండి
- By Sudheer Published Date - 05:17 PM, Mon - 6 January 25

కాంగ్రెస్ పార్టీ మీడియా సెల్ ఛైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి (Sama Ram Mohan Reddy), బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ముఖ్యంగా కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకి సంబంధించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సామ రామ్మోహన్ ఘాటుగా స్పందించారు. తాను ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యల్లో కేటీఆర్ కుటుంబ పాలనను విమర్శిస్తూ, ఆయన గతాన్ని గుర్తుచేశారు.
Gulf Countries : ఖతర్‌లో చిక్కుకున్న మహిళకు మంత్రి లోకేశ్ అండ
సామ రామ్మోహన్ తన ట్విట్టర్‌లో “సిగ్గుందా సైకో రామ్? కుటుంబ పాలన గురించి మాట్లాడే ముందు మీ ఇంట్లో అద్దం ముందు నిలబడి మాట్లాడండి” అంటూ కేటీఆర్‌పై కౌంటర్ ఇచ్చారు. “సిగ్గుందా సైకో రామ్?? నువ్వు కుటుంబ పాలన గురించి మాట్లాడుతున్నావా ??? ఇవే వ్యాఖ్యలకి నువ్వు అద్దం ముందు చేస్తే.. నీ నీడ కూడా నీ మీద ఉమ్మేస్తది.. ఏ పదవీ లేనప్పుడు మీ అయ్యకి టాబ్లెట్లు, టాయిలెట్ పేపర్లు అందించే సంతుకి 1+1 సెక్యూరిటీ ఎవడు ఇచ్చిండు?? రాజ్యసభ ఎంపీకి ISW ప్రోటోకాల్ కాకపోయినా 2+2 సెక్యూరిటీ ఎవడు పెట్టిండు?? మీలాగా అధికారంలో ఉన్నప్పుడు కుటుంబమంతా ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు నియమించుకోలేదు వాళ్లు. మీ కుటుంబంలాగా రాష్ట్రంలోని జిల్లాలను ఆస్తుల్లా పంచుకోలేదు వాళ్లు.. మీలాగా కుటుంబమంతా దోపిడీ దొంగల్లాగ రాష్ట్రాన్ని కొల్లగొట్టలేదు వాళ్లు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు సంక్షేమాన్ని పంచడంలో పాల్గొంటున్నారు. మీ కుటుంబంలాగ అయ్య కాళేశ్వరం, బావ కాకతీయ, చెల్లె లిక్కర్, తమ్ముడు మొక్కల్, నువ్వు A – Z చేసిన కుంభకోణాల మాదిరి కాదు.” అంటూ ఘాటైన వ్యాఖ్యలతో ట్వీట్ చేశారు.
ఇంతటితో ఆగకుండా ఫార్ములా ఈ రేసు కుంభకోణానికి సంబంధించి బీఆర్ఎస్‌పై సీరియస్ ఆరోపణలు చేశారు. గ్రీన్ కో సంస్థ ద్వారా బీఆర్ఎస్‌కు వచ్చిన నిధులపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, కేటీఆర్ ఈ అంశంపై తగిన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంతో బీఆర్ఎస్ మధ్య నిధుల లావాదేవీలు ప్రజలకు స్పష్టత ఇవ్వాలని కోరారు. సామ రామ్మోహన్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం మరింత వేడెక్కింది.
భారం ప్రభుత్వానికి.. బాండ్లు బిఆర్ఎస్ కు.. వెలుగులోకి వస్తున్న @KTRBRS ఫార్ములా-ఈ కుంభకోణం..
ఉట్టి కేసు.. లొట్టపీసు కేసు అన్న టిల్లు నేడు ప్రశ్నలకు ఉలిక్కిపడుతున్నాడెందుకు??
మీడియా సూటి ప్రశ్నలకు సొల్లు జవాబులెందుకు ఇస్తున్నట్టూ??
తెలంగాణ సర్కార్ , ఎఫ్ ఈ ఓ లండన్, గ్రీన్ కో… pic.twitter.com/a0CvKdHOYg
— Sama Ram Mohan Reddy (@RamMohanINC) January 6, 2025
సిగ్గుందా సైకో రామ్??
నువ్వు కుటుంబ పాలన గురించి మాట్లాడుతున్నావా ??? ఇవే వ్యాఖ్యలకి నువ్వు అద్దం ముందు చేస్తే.. నీ నీడ కూడా నీ మీద ఉమ్మేస్తది..ఏ పదవీ లేనప్పుడు మీ అయ్యకి టాబ్లెట్లు, టాయిలెట్ పేపర్లు అందించే సంతుకి 1+1 సెక్యూరిటీ ఎవడు ఇచ్చిండు??
రాజ్యసభ ఎంపీ కి ISW ప్రోటోకాల్… pic.twitter.com/Af2J4Qw9xG
— Sama Ram Mohan Reddy (@RamMohanINC) January 6, 2025