Architect House Looted : వాస్తు నిపుణుడి ఇంట్లో రూ.4 కోట్లు లూటీ
Architect House Looted : హైదరాబాద్‌లోని మధురానగర్‌లో భారీ దోపిడీ జరిగింది.
- By Pasha Published Date - 11:38 AM, Sun - 17 September 23

Architect House Looted : హైదరాబాద్‌లోని మధురానగర్‌లో భారీ దోపిడీ జరిగింది. సారథి స్డూడియో వెనుక ఏరియాలో వాస్తుశాస్త్ర నిపుణుడు వీఎల్‌ఎన్ చౌదరి అద్దెకు ఉంటున్న ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఈనెల 12న ఉదయం వీఎల్‌ఎన్ చౌదరి ఇంట్లో లేని సమయంలో దొంగలు లూటీ చేశారు. ఇంట్లో ఉన్న రూ.3 కోట్ల 93 లక్షల నగదు, 450 గ్రాముల బంగారం దోచుకెళ్లారు. ఆ రోజున రాత్రి 11 గంటల 45నిమిషాల సమయంలో ఇంటికి తిరిగొచ్చిన వీఎల్‌ఎన్ చౌదరి.. పెంట్‌హౌస్ తలుపులు తెరిచి ఉండటం చూసి షాకయ్యాడు. ఇంటి మెట్లు, గోడలు కూడా దెబ్బతిని ఉండటాన్ని గమనించాడు. ఇంట్లోకి వెళ్లి చూడగా.. పరుపు కింద ఉన్న డబ్బు, బంగారం కనిపించలేదు. దీంతో కంగారు పడి… మధురానగర్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు. ఇంట్లోని 3 లాప్‌టాప్‌లు, 3 సెల్‌ఫోన్లు, విలువైన డాక్యుమెంట్లు కూడా దొంగలు ఎత్తుకెళ్లారని ఫిర్యాదులో ప్రస్తావించాడు. హైదరాబాద్ లో సొంత ఇల్లు కొనేందుకు తాను రూ.4 కోట్లు రెడీ చేసుకున్నానని తెలిపాడు. పోలీసులు కేసు (Architect House Looted) నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also read : Congress Manifesto: సోనియా గాంధీ చేతుల మీదుగా కాంగ్రెస్ మేనిఫెస్టో