IT Rides : ఓటమి భయంతో కాంగ్రెస్ అభ్యర్థుల ఫై ఐటీ దాడులు – రేవంత్ రెడ్డి
బీజేపీతో కలిసి బీఆర్ఎస్ నేతలు కుట్రలు చేస్తున్నారని, ఓటమి భయంతో కాంగ్రెస్ అభ్యర్థులను భయ పెట్టే ఉద్దేశంతోనే ఐటీ దాడులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు
- Author : Sudheer
Date : 02-11-2023 - 3:27 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ ఎన్నికల వేళ (Telangana Elections Time) హైదరాబాద్ లో ఐటీ దాడులు (IT rides) కలకలం సృష్టిస్తున్నాయి. ఈరోజు తెల్లవారు జామునుండి పలువురు కాంగ్రెస్ నేతల ఇళ్లలో , ఆఫీస్ లలో ఐటీ సోదాలు చేయడం పట్ల కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని బడంగ్ పేట్ కార్పొరేటర్, కాంగ్రెస్ మహిళ నేత పారిజాత నరసింహారెడ్డి(Parijata Narasimha Reddy)ఇంటిపై ఐటి అధికారులు దాడులు నిర్వహించారు. అలాగే మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్ధి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి (Kichannagari Lakshma Reddy) నివాసంలోను సోదాలు జరుగుతున్నాయి. దాదాపు 50 మంది అధికారులు ఈ సోదాల్లో పాల్గొంటున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
అలాగే కేఎల్ఆర్ వియ్యంకుడు రాజేందర్ రెడ్డి ఇంట్లో కూడా తనిఖీలు చేపట్టారు. మహేశ్వరంలో కేఎల్‌ఆర్ గెలుపు ఖాయమన్న భయంతోనే ఆయన్ని టార్గెట్ చేశారని అభిమానులు ఆరోపిస్తున్నారు. ఈ దాడుల ఫై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. బీజేపీతో కలిసి బీఆర్ఎస్ నేతలు కుట్రలు చేస్తున్నారని, ఓటమి భయంతో కాంగ్రెస్ అభ్యర్థులను భయ పెట్టే ఉద్దేశంతోనే ఐటీ దాడులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మేడిగడ్డ వద్ద కుంగిపోయిన బ్యారేజీని పరిశీలించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ, బీఆర్ఎస్ తీరుపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి ఆర్థిక సాయం చేస్తామన్న వ్యాపారులను.. బీఆర్ఎస్ సర్కార్ బెదిరిచిందని గతంలో ఆరోపించారు. ఇప్పుడు బీజేపీతో కలిసి బీఆర్ఎస్ పార్టీనే ఆర్థికంగా బలమైన తమ అభ్యర్థులను టార్గెట్ చేసిందని రేవంత్ అన్నారు.
Read Also : BJP Releases 3rd List : బిజెపి మూడో విడత అభ్యర్థుల లిస్ట్ విడుదల