Revanth Reddy : కాంగ్రెస్ ఆరు గ్యారంటీ పథకాల అమలు ఫైల్ ఫై రేవంత్ తొలి సంతకం
ప్రధానంగా మహిళలు, రైతులు, విద్యార్థులు, ఇళ్లు లేని పేద కుటుంబాలు, నిస్సహాయుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఈ హామీలను ప్రకటించడంతో ఆయా వర్గాల్లో భారీగా ఆశలు రేకెత్తాయి
- Author : Sudheer
Date : 06-12-2023 - 11:42 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ (Telangana) కొత్త సీఎం గా రేవంత్ రెడ్డి (Revanth Reddy) రేపు మధ్యాహ్నం 1 :04 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ , రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ లతో పాటు ఖర్గే , వేణుగోపాల్ తదితరులు హాజరు కాబోతున్నారు. ఇక ప్రమాణ స్వీకార కార్యక్రమం లోనే రేవంత్ రెడ్డి తొలి సంతకం (Revanth first signature ) కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ హామీ ( six Guarantee Schemes)ల ఫై పెట్టనున్నారని సమాచారం.
We’re now on WhatsApp. Click to Join.
ప్రధానంగా మహిళలు, రైతులు, విద్యార్థులు, ఇళ్లు లేని పేద కుటుంబాలు, నిస్సహాయుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఈ హామీలను ప్రకటించడంతో ఆయా వర్గాల్లో భారీగా ఆశలు రేకెత్తాయి. కాగా ఈ హామీల అమలుకు ఏటా కనీసం రూ.88 వేల కోట్ల నిధులు అవసరం అవుతాయని ఓ అంచనా. అయితే పూర్తి స్థాయిలో ఆరు గ్యారంటీలను అమలు చేస్తే మాత్రం నిధుల అవసరాలు రూ.లక్ష కోట్లకు చేరే అవకాశం ఉందని అంటున్నారు. మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీలతో పాటు పెద్ద సంఖ్యలో ఇతర హామీలను కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. వీటి అమలుకు మరిన్ని రూ.వేల కోట్ల నిధులు అవసరం కానున్నాయి. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోగా ఎన్నికల హామీలను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. 2004లో వైఎస్సార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఉచిత విద్యుత్ ఫైల్ పైన ప్రమాణ స్వీకార వేదిక పైనే సంతకం చేసారు. ఇప్పుడు రేవంత్ అదే తరహాలో సంతకానికి సిద్దమయ్యారు. ఆ తరువాత 9న మంత్రివర్గ సమావేశంలో ఈ పథకాల అమలు తీరు తెన్నులను ఖరారు చేయనున్నారు. తెలంగాణలో ప్రస్తుత ఆర్దిక పరిస్థితులు రేవంత్ కు సవాల్ గా మారుతున్నాయి.
Read Also : Revanth Reddy: తెలంగాణలో ఖాళీగా 6 ఎమ్మెల్సీ స్థానాలు, రేవంత్ ఛాన్స్ ఇచ్చేదెవరికో