Revanth Reddy: తెలంగాణలో ఖాళీగా 6 ఎమ్మెల్సీ స్థానాలు, రేవంత్ ఛాన్స్ ఇచ్చేదెవరికో
ఎమ్మెల్సీల రేసులో షబ్బీర్ అలీ, అద్దంకి దయాకర్ సహా మరికొందరి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.
- By Balu J Published Date - 11:39 AM, Wed - 6 December 23

Revanth Reddy: తెలంగాణ ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోతున్న కాంగ్రెస్, ఇతర పాలన విభాగాలు, నామినేటేడ్ పోస్టులు, అధికారిక డిపార్ట్ మెంట్స్ పై ద్రుష్టి సారించబోతుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి గా ఖరారైన రేవంత్ రెడ్డి తన క్యాబినెట్ లో ఎవరు ఉండాలి? ఎవరికీ కీలక పదవులు ఇవ్వాలి? అనే అంశంపై ఏఐసీసీ పెద్దలతో మాట్లాడారు. అయితే రేపే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో ఎల్బీ స్టేడియంలో ప్రమాణస్వీకారం చేయనున్నారు.
అయితే ఈ నేపథ్యంలో తెలంగాణలో 6 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నట్టు సమాచారం. ఎమ్మెల్సీలుగా ఉన్న పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. దీంతో ఈ నాలుగు స్థానాలు ఖాళీ కానున్నాయి. వీటితో పాటు గవర్నర్ కోటాలో మరో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మొత్తం కలిపి ఆరు స్థానాలను భర్తీ చేయాల్సి ఉంటుంది.
అయితే ఎమ్మెల్సీల రేసులో షబ్బీర్ అలీ, అద్దంకి దయాకర్ సహా మరికొందరి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. సీపీఐ నేతలకు కూడా ఎమ్మెల్సీ ఇస్తారనే చర్చ నడుస్తోంది. అయితే ఎమ్మెల్సీగా నామినేట్ అయిన వాళ్లు మంత్రి వర్గంలోనూ చోటు దక్కించుకోవచ్చు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ ఎవరికి ఛాన్స్ ఇస్తాడో వేచి చూడాల్సిందే.
Also Read: Telangana: డాక్టర్ ఎమ్మెల్యేనే ఆరోగ్య శాఖ మంత్రిగా నియమించండి