Good News : ఇందిరమ్మ లబ్దిదారులకు గొప్ప శుభవార్త తెలిపిన సీఎం రేవంత్
Good News : మార్కెట్‌లో ఓ సిమెంట్ బస్తా ధర రూ.80 వరకు, స్టీల్ టన్ను ధర రూ.3,000 వరకు పెరగడం వల్ల ఒక్క ఇంటి నిర్మాణానికి అదనంగా రూ.17,000 వరకు ఖర్చు అవుతోంది
- By Sudheer Published Date - 08:37 PM, Wed - 21 May 25

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangna Govt) ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం (Indiramma Housing Scheme) పేద ప్రజలకు శాశ్వత గృహాలను కల్పించడమే లక్ష్యంగా వేగంగా ముందుకెళుతోంది. అయితే, నిర్మాణ సామగ్రి ధరలు పెరగడం వల్ల లబ్ధిదారులపై ఆర్థిక భారం పెరిగింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సిమెంట్, స్టీల్ కంపెనీ (Cement and steel Company) లతో నేరుగా చర్చలు ప్రారంభించింది. లక్షలాది ఇళ్లు నిర్మించాలన్న లక్ష్యంతో, తక్కువ ధరకే సిమెంట్, స్టీల్ అందించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Kitchen: వంటగది అందంగా ఉండాలంటే ఈ మొక్కలు ఉండాల్సిందే!
ప్రభుత్వ అంచనాల ప్రకారం, ఈ ఏడాది 4.5 లక్షల ఇళ్ల నిర్మాణానికి సుమారు 40.5 లక్షల టన్నుల సిమెంట్ మరియు 68 లక్షల టన్నుల స్టీల్ అవసరమవుతుంది. ఈ నేపథ్యంలో, మార్కెట్‌లో ఓ సిమెంట్ బస్తా ధర రూ.80 వరకు, స్టీల్ టన్ను ధర రూ.3,000 వరకు పెరగడం వల్ల ఒక్క ఇంటి నిర్మాణానికి అదనంగా రూ.17,000 వరకు ఖర్చు అవుతోంది. దీంతో రూ.5 లక్షల సహాయం సరిపోవడంలేదు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, సిమెంట్‌ను రూ.260కి, స్టీల్‌ను రూ.47 వేలకు సరఫరా చేయాలని ప్రభుత్వ ప్రతినిధులు కోరారు. కంపెనీలు కూడా సానుకూలంగా స్పందించాయి.
ప్రభుత్వం ఇప్పుడు మద్యవర్తులను తొలగించి, నేరుగా లబ్ధిదారులకు సిమెంట్, స్టీల్ అందించాలన్న ఆలోచనలో ఉంది. ఇందుకోసం ప్రత్యేక కేంద్రాల ఏర్పాటుతో పాటు, స్థానిక అధికారుల ధ్రువీకరణ ఆధారంగా సరుకులు ఇచ్చే విధానం రూపొందిస్తోంది. దీనివల్ల లబ్ధిదారులకు నాణ్యమైన సామగ్రి తక్కువ ధరకు లభించడమే కాకుండా, పథకంలో పారదర్శకత పెరుగుతుంది. దీనివల్ల పేదలు తమ ఇంటిని గడిచిన భారం లేకుండా పూర్తిచేసుకునే అవకాశాలు మెరుగవుతున్నాయి. ఇది “ఇందిరమ్మ ఇల్లు” పథకాన్ని మరింత విజయవంతం చేసే దిశగా పెద్ద అడుగుగా నిలవనుంది.