HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Reddys Community Will Be The Key To Congress Victory

T Congress : కాంగ్రెస్ గెలుపులో కీల‌కం కానున్న ఆ సామాజిక‌వ‌ర్గం.. వాళ్లంతా క‌లిస్తే..!

తెలంగాణలో కాంగ్రెస్ వైపుకి రెడ్డి సామాజిక వర్గం, బ్రాహ్మణులు మొదలు దళితులు, గిరిజనుల దాకా, మైనార్టీలతో సహా... అన్ని

  • Author : Prasad Date : 18-06-2023 - 3:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Congress Success Secret
Congress Success Secret
తెలంగాణలో కాంగ్రెస్ వైపుకి రెడ్డి సామాజిక వర్గం, బ్రాహ్మణులు మొదలు దళితులు, గిరిజనుల దాకా, మైనార్టీలతో సహా… అన్ని వర్గాల్లోనూ కాంగ్రెస్ కు ఓటర్ల బలంగా ఉన్నారు. ఇది మనకు స్వతంత్రం వచ్చిన నాటి నుంచీ నిరూపితం అవుతోన్నదే.. అయితే తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు అతి పెద్ద బలం రెడ్డి సామాజిక వర్గం. వాళ్లు మొదటి నుంచీ హస్తంతోనే కొనసాగుతున్నారు. ఇతర వర్గాల ధోరణి ఎలా ఉన్నా.. ఎన్నికలు వచ్చిన ప్రతీ సారి రెడ్డి సామాజిక వర్గం ఓటర్లు చేతి గుర్తుకే చేయెత్తి జైకొడుతున్నారు. అయితే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తరువాత తెలంగాణలోనూ రెడ్లు ఎప్పటిలాగే కాంగ్రెస్ ను ఆదరిస్తూ వచ్చారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కాస్త మార్పు కనిపించింది. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ తెలంగాణ రెడ్డి సామాజిక వర్గాన్ని కొంత వరకూ అప్పట్లో ప్రభావితం చేసింది. కేసీఆర్ తో స్నేహం చేసిన జగన్ కారు గుర్తుకు ఓటు వేయాలంటూ పనిగట్టుకుని తెలంగాణలో ప్రచారం చేయించాడు. అనధికారికంగా వైసీపీ మీటింగులు పెట్టి కేసీఆర్ వైపుకు రెడ్డి ఓట్లను మళ్లించింది. అయితే అయిదేళ్ల తరువాత ఇప్పుడు మరో మారు ఆ సామాజికవర్గం కాంగ్రెస్ వైపుకే మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కుచుకుళ్ల దామోదర్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరామ్ రెడ్డి, గుర్నాథ్ రెడ్డి,ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కీలక నేత కేఎల్ఆర్ అలియాస్ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి మళ్ళీ యాక్టివ్ అవ్వడం.. ఇలా అనేక మంది రెడ్డి సామాజిక నేతలు, ప్రముఖులు హస్తంతో చేతులు కలుపుతున్నారు. ఎన్నికలు దగ్గరపడేకొద్ది టీ కాంగ్రెస్ లోకి మరింత మంది రెడ్డి  సామాజికవర్గం నేతలు వలససొచ్చే అవకాశాలున్నాయని బలమైన టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే బీఆర్ఎస్ సీఎం కూర్చీపై ఆశలు వదులుకోవాల్సిందే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే, తెలంగాణలో ఆర్థిక, రాజకీయ పలుకుబడిలో రెడ్లదే మొదటి స్థానం. అలాగే ఓటర్లుగా కూడా రెడ్డి కులస్థులు గణనీయంగా ఉంటారు. ఏక కాలంలో.. అటు రెడ్డి నేతలు, ఇటు రెడ్డి ఓటర్లు.. కాంగ్రెస్ కు జైకొడితే.. కర్ణాటక తరువాత దక్షిణాదిలో మరో రాష్ట్రం హస్తం వశం కాకుండా.. ఎవరూ ఆపలేరని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • cast politics
  • congress
  • telangana
  • telangana congress

Related News

Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో తెలంగాణ ప్రపంచ దేశాలకు కొత్త దిశానిర్దేశం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం అన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి హెచ్‌ఐసిసిలో “గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ – ది హైదరాబాద్ కలెక్టివ్”ను ప్రారంభిస్తూ, “రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతలను కూడ

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • National Status... Palampet Shiva Temple, Mulugu District

    Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం

  • Draft Of 'core Urban Region

    GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

Latest News

  • US – Iran War: ట్రంప్ హెచ్చరించిన తర్వాత, చాబహార్ ఓడరేవుపై దాడి

  • Heavy rains: వర్షం ఎఫెక్ట్‌.. రోడ్లు నదులుగా మారాయి

  • Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

  • Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు

  • LPG gas cylinder: భారీ వర్షాలకు కొట్టుకొస్తున్న 3,000 ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd