Boinipally Srinivas Rao: బోయినపల్లి శ్రీనివాసరావు ఇంటికి గౌతమ్ అదానీ.. ఎవరాయన ?
బీఆర్ఎస్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ సోదరుడే బోయినపల్లి శ్రీనివాసరావు(Boinipally Srinivas Rao).
- By Pasha Published Date - 09:09 AM, Mon - 10 March 25

Boinipally Srinivas Rao: గౌతమ్ అదానీ.. ప్రపంచ కుబేరుల్లో ఒకరు. మన దేశంలో సంపద విషయంలో రెండో స్థానంలో ఉన్న పారిశ్రామికవేత్త అదానీయే. ప్రధానమంత్రి నరేంద్రమోడీకి గౌతమ్ అదానీ సన్నిహితులు అని చెబుతుంటారు. తాజాగా ఆదివారం రోజు హైదరాబాద్ నగరానికి గౌతమ్ అదానీ, ఆయన కుమారుడు కరణ్ అదానీ వచ్చారు. ప్రతిమ గ్రూప్ ఛైర్మన్ బోయినపల్లి శ్రీనివాసరావు నివాసంలో జరిగిన ఒక కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. వారికి ప్రతిమ శ్రీనివాసరావు కుమార్తెలు డాక్టర్లు హరిణి, హాసినీ స్వాగతం పలికారు. గౌతమ్, కరణ్‌లు తేనీటి విందును స్వీకరించారు.
సొంత హెలికాప్టర్
ప్రతిమ గ్రూప్స్ అధినేత బోయినపల్లి శ్రీనివాస్ రావు 2022 డిసెంబరు నెలలో సొంత హెలికాప్టర్ కొన్నారు. దీనికి యాదగిరిగుట్టలోని హెలిప్యాడ్ వద్ద ప్రత్యేక పూజలు చేయించారు. ఈ పూజలో మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు పాల్గొన్నారు.
Also Read :Canada New PM: కెనడా ప్రధానిగా ఆర్థికవేత్త కార్నీ.. ఆయన హిస్టరీ గొప్పదే
బోయినపల్లి శ్రీనివాసరావు ఎవరు ?
- బీఆర్ఎస్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ సోదరుడే బోయినపల్లి శ్రీనివాసరావు(Boinipally Srinivas Rao).
- బోయినపల్లి శ్రీనివాసరావు పారిశ్రామికవేత్తగా అన్ని రాజకీయ పార్టీల ప్రముఖులతోనూ సన్నిహిత సంబంధాలను కలిగి ఉన్నారు.
- బోయినపల్లి శ్రీనివాసరావు దాదాపు 20 కంపెనీలకు డైరెక్టర్‌గా ఉన్నారు.
- ప్రతిమ గ్రూప్ అనే వ్యాపార సంస్థను ఆయన నిర్వహిస్తున్నారు.
- వైద్యరంగం, ఇంధన రంగం, మౌలిక సదుపాయాలు, తయారీ, టెలికాం, వినోదం, ఆతిథ్యం వంటి విభిన్న రంగాల్లో ప్రతిమ గ్రూప్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
- ఇంధన రంగంలో ఎల్గెన్ ప్రాజెక్ట్, మౌలిక సదుపాయాల రంగంలో ప్రతిమ ఇన్‌ఫ్రా పేరుతో కంపెనీలను బోయినపల్లి శ్రీనివాసరావు నడుపుతున్నారు. బహుశా ఈ కంపెనీలు అదానీ గ్రూపుతో కలిసి పనిచేస్తుండొచ్చనే అంచనాలు ఉన్నాయి.
- సామాజిక సేవ కోసం ప్రతిమ ఫౌండేషన్‌ను బోయినపల్లి శ్రీనివాసరావు నిర్వహిస్తున్నారు.
- ప్రతిమ ఎడ్యుకేషనల్ సొసైటీలో ఒక భాగంగా ప్రతిమ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశారు.
- ప్రతిమ ఎడ్యుకేషనల్ సొసైటీని 2001లో ఏర్పాటు చేశారు. ఇది తొలుత కరీంనగర్‌లో ప్రతిమ ఆస్పత్రి (PIMS)ని ఏర్పాటు చేసింది.
- అత్యాధునిక వైద్య మౌలిక సదుపాయాలతో వరంగల్ నగరం శివార్లలో నిర్మించిన ప్రతిమ ఆస్పత్రి వీరిదే. దీన్ని స్వయంగా ఆనాటి సీఎం కేసీఆర్ ప్రారంభించారు.