Rashtrapati Nilayam: రండి.. రాష్ట్రపతి నిలయం చూసొద్దాం!
హైదరాబాద్ (Hyderabad) బొల్లారంలోని భారత రాష్ట్రపతి నిలయాన్ని విజిట్ చేయొచ్చు.
- By Balu J Published Date - 04:44 PM, Tue - 3 January 23

రాష్ట్రపతి నిలయం (Rashtrapati Nilayam) ఓ అధికారిక భవనం.. విలాసవంతమైన ప్రాంగణం.. పురాతన కట్టడాలు, భవంతులు.. మరి అలాంటి భవనాన్ని సామాన్యులు సైతం చూడాలని ఆసక్తి చూపుతుంటారు. విఐపీలు, ప్రముఖులు మాత్రమే సందర్శించే రాష్ట్రపతి నిలయాన్ని సామాన్యులు (Visitors) సైతం చూడవచ్చు. జనవరి 3 నుండి జనవరి 15 వరకు ఉదయం 10, సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉండనుంది. హైదరాబాద్ బొల్లారంలోని భారత రాష్ట్రపతి నిలయాన్ని విజిట్ చేయొచ్చు.
ప్రతి సందర్శకుడికి టిక్కెట్టు జారీ చేయబడుతుంది. రాష్ట్రపతి నిలయంలోని (Rashtrapati Nilayam) గేట్ నంబర్ 2 సమీపంలోని కౌంటర్ వద్ద టికెట్స్ పొందవచ్చు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రాష్ట్రపతి నిలయం భవనాన్ని హైదరాబాద్ నిజాం స్వాధీనం చేసుకుని రాష్ట్రపతి సెక్రటేరియట్‌కు అప్పగించారు. అప్పటి నుండి జనవరి మొదటి వారంలో సామాన్య ప్రజలకు (Common people) అందుబాటులో ఉండనుంది. ప్రధాన భవనం 1860లో నిర్మించబడింది. ఇందులో 16 గదులు ఉన్నాయి.
ఇందులో డైనింగ్ హాల్, దర్బార్ హాల్, మార్నింగ్ రూమ్, పిల్లల గది, ఇతర సౌకర్యాలు ఉన్నాయి. నిలయం ప్రాంగణంలో వివిధ ప్రకృతి దృశ్యాలతో కూడిన తోటలు, మూలికా తోటలు, కాలానుగుణంగా పుష్పించే మొక్కల తోటలు, మామిడి, దానిమ్మ, జామ, ఉసిరి, కొబ్బరి, చీకు (సపోటా) వివిధ రకాల తోటలను దగ్గరగా చూడవచ్చు. హెర్బల్ గార్డెన్ 7,000 చదరపు మీటర్లలో విస్తరించి ఉంది 116 రకాల ఔషధ, సుగంధ మొక్కలున్నాయి. నక్షత్ర ఉద్యానవనం నిలయంలో (Rashtrapati Nilayam) ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము తన ఇటీవలి పర్యటనలో శంకుస్థాపన చేసిన ఆవరణలో పిల్లల కోసం ‘మేజ్ గార్డెన్’ నిర్మించాలని నిలయం అధికారులను ప్రతిపాదించారు.
Also Read: Basara Issue: సరస్వతిదేవిపై అనుచిత వ్యాఖ్యలు.. బాసర బంద్!